నావికాదళం కోసం అదానీ డ్రోన్‌

నావికాదళం కోసం అదానీ డ్రోన్‌
దేశీయంగా త‌యారైన‌ దృష్టి 10 స్టార్‌లైన‌ర్ యూఏవీని భారత నావికాదళం ఆవిష్క‌రించింది. నావ‌ల్ స్టాఫ్ అడ్మిర‌ల్ ఆర్ హ‌రి కుమార్‌ ఆ డ్రోన్‌ను ఆవిష్క‌రించారు. దృష్టి 10 స్టార్‌లైన‌ర్‌ను ఆధునిక మాన‌వ‌ర‌హిత వాహ‌నంగా తీర్చిదిద్దారు.  యుద్ధ స‌మ‌యాల్లో ఈ డ్రోన్ కీల‌క పాత్ర పోషించ‌నున్నది.
ఇంటెలిజెన్స్‌, స‌ర్వియ‌లెన్స్‌, రిక‌న్న‌యిసెన్స్‌(ఐఎస్ఆర్) ప్లాట్‌ఫామ్ ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇది ఏక‌ధాటిగా 36 గంట‌లు ప‌నిచేయ‌గ‌ల‌దు. సుమారు 450 కేజీల బ‌రువు కూడా ఇది మోయ‌గ‌ల‌దు. అన్ని వాతావ‌ర‌ణాల‌ను త‌ట్టుకునే రీతిలో దీన్ని నిర్మించారు. స్ట‌నాగ్‌-4671 స‌ర్టిఫికేష‌న్ ఇచ్చారు. ఎటువంటి ఎయిర్‌స్పేస్‌లోనైనా ఇది ప్ర‌యాణించ‌గ‌ల‌దు.
 
హైద‌రాబాద్‌లోని అదానీ ఎయిర్‌స్పేస్ పార్క్‌లో ఈ డ్రోన్‌ను ఆవిష్క‌రించారు. అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సంస్థ దేశానికి కావాల్సిన ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తా ప‌రిక‌రాల‌ను నిర్మిస్తున్న‌ది. ఇప్ప‌టికే చిన్న చిన్న ఆయుధాలు, యూఏవీలు, రేడార్లు, డిఫెన్స్ ఎల‌క్ట్రానిక్స్‌, ఏవియానిక్స్‌, టాక్టిక‌ల్ క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్స్‌ను అదానీ సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. ర‌క్ష‌ణ‌, సివిల్ అవ‌స‌రాల కోసం కౌంట‌ర్ డ్రోన్ సిస్ట‌మ్‌ను అదానీ కంపెనీ డెవ‌ల‌ప్ చేస్తున్న‌ది.