మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఇప్పటి వరకు దాదాపు 105 మందిని సిట్ అరెస్ట్ చేసింది. మరికొందరి పాత్రపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోదోషులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విచారణకు అటంకాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకమండలి లేకపోవడంతో నియామకాల ప్రక్రియ నిలిచిపోవడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుందని ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. కొత్త నోటిఫికేషన్ల విడుదలతో పాటు ఇప్పటికే చేపట్టిన నోటిఫికేషన్ల పరీక్షల నిర్వహణపై పడుతుందని వివరించడంతో పాలకమండలి రాజీనామాలకు గవర్నర్ అమోదించినట్టు తెలుస్తోంది.
పైగా, చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా గవర్నర్ వాటిని ఇంత వరకు ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ కు లేఖ రాశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. దీంతో వారి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
త్వరలోనే కొత్త పాలకమండలిని ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సమూలు సంస్కరణలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీ పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి యూపిఎస్సీ తరహా విధానాల అమలుపై అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
More Stories
అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం
భారతీయులందరూ సంస్కృత భాష నేర్చుకోవాలి
సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు ప్రత్యేక రైలు