
నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలు అయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. పట్టాలు తప్పి ప్లాట్ ఫాడ్ సైడ్ వాల్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
చెన్నైలోని డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఈ ఉదయం నాంపల్లికి చేరుకుంది. స్టేషన్‌లో ప్రవేశించినప్పుడు ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పింది. ప్లాట్ ఫామ్ నంబర్ 5 మీదికి వచ్చిన అనంతరం పట్టాలు తప్పింది. నేరుగా వెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టింది. ప్రమాదంలో మూడు ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్‌ను ఢీకొట్టి రైలు పట్టాలు తప్పినట్లు సమాచారం. ఒక్కసారి రైలు కుదుపునకు గురికావడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంక్రాంతి పండగా వేళ ఈ ప్రమాదం జరగడం తో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. గత కొద్దీ నెలలుగా వరుస గా రైలు ప్రమాదాలు జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వారంలో ఎక్కడో ఓ చోట రైలు ప్రమాద ఘటన వార్తల్లో నిలుస్తుంది.
More Stories
ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ!
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం