తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డీజీపీ రవిగుప్తాకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల వర్సిటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని రేణుశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది.
మీడియా కథనాలను ఆధారంగా సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం నాలుగువారాల్లోగా వివరణ ఇవ్వాలనంటూ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చిందని, కళాశాల యాజమాన్యం చేపట్టిన అంతర్గత దర్యాప్తు ఏమిటని ప్రశ్నించింది. ఈ సంఘటనకు బాధ్యులైన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో చేర్చాలని ఎన్‌హెచ్ఆర్సీ డీజీపీని ఆదేశించింది.
ఇటువంటి బాధాకర ఘటనలు భవిష్యత్తులో జరగకుండా తీసుకొంటున్న చర్యల గురించి కూడా ప్రశ్నించింది. మీడియా కధనాలు వాస్తవమైతే తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనగా భావించాల్సి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 5న సంగారెడ్డి జిల్లా రుద్రాంలో ఉన్న గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.
కాలేజీ భవనంలోని ఐదో అంతస్తుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ప్రాణాలను తీసుకున్నది. ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు నెలల క్రితమే కాలేజీలో చేరిన ఆమె ప్రతిరోజూ కూకటపల్లి నుండి బస్సు లో తరగతులకు హాజరవుతున్నది.
More Stories
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి