విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఎస్సీ‌, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో విజయవాడ నగరం నడిబొడ్డున చేపట్టిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి.  దాదాపు ఏడాది క్రితమే పనులు పూర్తి కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది.
విజయవాడ నగరంలో 19 ఎకరాల విస్తరణలో  దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనంలో ఈ నెల 19న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సన్నాహాలు చేస్తున్నారు.  జనవరి 10 కల్ల మిగిలిన నిర్మాణ పన్నులని పూర్తి కానున్నట్టు అధికారులు వివరించారు.
స్వరాజ్య మైదానంలో రెండు దశలుగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం పనులను తొలి దశలో రూ.268.46 కోట్లతోనూ, మలి దశలో రూ.106.64 కోట్లతోనూ చేపట్టారు. సుమారుగా రూ.400 కోట్ల తో స్మృతివనాన్ని తీర్చిదిద్దారు.  రెండేళ్ల క్రితమే అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు పూర్తివ కావాల్సి ఉన్నా కరోనా, నిధుల విడుదలలో జాప్యం, ఆకృతులు ఖరారు కాకపోవడం వంటి కారణాలతో తీవ్ర జాప్యం జరిగింది.

తెలంగాణలో దాదాపు రూ. 200 కోట్లతో విగ్రహ నిర్మాణం, మ్యూజియం, ఇతర పనుల్ని పూర్తి చేశారు. ఏపీలో మాత్రం 125 అడుగల విగ్రహం, 80 అడుగల ఎత్తున పీఠం, కాన్ఫరెన్స్‌ హాల్స్‌, మ్యూజియం, థియేటర్లు, ల్యాండ్‌ స్కేపింగ్ ఇతర పనులకు దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేశారు. స్మృతివనంలో భాగంగా నిర్మించిన మినీ థియేటర్, మ్యుజియం పనులను పరిశీలించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు.