”త్వరలోనే సీఏఏ నిబంధనలను జారీ చేయనున్నాం. ఒకసారి నిబంధనలను జారీ అయినట్లయితే చట్టం వెంటనే అమల్లోకి వస్తుంది. అర్హత కలిగిన వారికి పౌరసత్వం మంజూరు చేస్తాం” అని ఆయన తెలిపారు. ఏప్రిల్-మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను నోటిఫై చేస్తారా అని అడిగినప్పుడు, దానికంటే చాలా ముుందుగానే ఉంటుందని ఆ అధికారి సమాధానమిచ్చారు.
నిబంధనలు సిద్ధమయ్యాయని, ఆన్‌లైన్ పోర్టల్ కూడా రెడీగా ఉందని, మొత్తం ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుందని చెప్పారు. ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా ఇండియాలోకి ఎప్పుడు అడుగుపెట్టారో దరఖాస్తుదారులు డిక్లేర్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అప్లికెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం స్పష్టం చేశారు.
సీఏఏ చట్టం కింద 2014 డిసెంబర్ 31 వరకూ బంగ్లాదేశ్, పాకిస్థా్న్, ఆప్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వలస వచ్చిన ముస్లిమేతరులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీలు, క్రిస్టియన్లకు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది. 2019 డిసెంబర్‌లో సీసీఏను పార్లమెంటు ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపారు.
పార్లమెంటులో బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు, పోలీసు చర్యల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2020 నుంచి పార్లమెంటరీ కమిటీ నిబంధనలు రూపొందిస్తోందనే కారణంగా హోం శాఖ ఎప్పటికప్పుడు నిబంధనల నోటిఫై చేయడాన్ని పొడిగిస్తూ వస్తోంది. మరోవంక, వలసపాలకుల నాటి క్రిమినల్ చట్టాలు ఐపీసీ, సీసీపీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానే మూడు బిల్లులను కేంద్రం ఇటీవల తీసుకువచ్చింది. గత డిసెంబర్ 21న ఈ మూడు బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సైతం ఆమోదముద్ర వేశారు.
పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష అధినీయం (బిఎస్‌ఎ) అనే మూడు కొత్త క్రిమినల్ జస్టిస్ చట్టాలను జనవరి 26 వతేదీ కల్లా నోటిఫై చేస్తామని, ఏడాదిలోగా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు.
జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం వంటి నేరాలకు కఠిన శిక్షలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏడేళ్లు, అంతకు పైబడి శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సెక్ తప్పనిసరని ఈ చట్టాలు చెబుతున్నారు. దేశంలోని 850 పోలీసు జిల్లాలలో ఉంచేందుకు గాను 900 ఫోరెన్సిక్ వ్యాన్లను సేకరించే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది.
వీటిని ఏదైనా నేరం జరిగితే వెంటనే ఫోరెన్సిక్ సాక్షం సేకరించి, నేరం జరిగిన ప్రదేశాన్ని వీడియో తీయడం సాధ్యపడుతుంది. ఈ మూడు కొత్త చట్టాలను నోటిఫై చేసిన తర్వాత పోలీసు అధికారులు, దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ రంగంతో సంబంధం ఉన్నవారికి శిక్షణా కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖ ప్రారంభించనున్నది.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం