
ఈ ప్రపంచమే ఒక కుటుంబం అనుకుంటే.. హింస తగ్గుతుంది. ప్రజలందరిలో సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. తద్వార శాంతి నెలకొంటుంది. అందుకే మనుషులంతా ఒకే కుటుంబంలా భావించాలనే ఉద్దేశ్యంతోనే జరుపుకునేదే.. గ్లోబల్ ఫ్యామిలీ డే. ప్రతీ ఏటా తొలిరోజు అంటే జనవరి 1 న ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే జరుపుకుంటారు. వాస్తవానికి నేటి ప్రపంచం సంఘర్షణలు, యుద్ధాలు, దాడులు, బాధలతో నిండిపోయింది. ఈ సమయంలో మనమంతా కలిసి ప్రేమ మరియు సహనంతో ప్రపంచాన్ని బాగుచేయాలనే సదుద్దేశ్యంతో.. ఐక్యరాజ్యసమితి ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే నిర్వహిస్తోంది. ఇది భిన్నత్వంలో ఏకత్వం అనే కాన్సెప్ట్ ను బలోపేతం చేస్తుంది.
ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్, మనమంతా ఒక పెద్ద కుటుంబంలో భాగం. మనం ఏ దేశం నుంచి వచ్చినా, ఏ జాతికి చెందినవారమైనా, ఏ మతాన్ని విశ్వసించినా, ప్రపంచ జనాభా అంతా ఒక పెద్ద కుటుంబమే. మొత్తం మానవాళి ఏకతాటిపైకి వచ్చి ప్రేమ మరియు శాంతిని అందించాలి. ఆశతో కూడిన ఆనందాన్ని తీసుకురావడానికి అంతా ఒక్కటి కావడమే.. ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే ముఖ్య ఉద్దేశ్యం. గ్లోబల్ ఫ్యామిలీ డేని ప్రపంచ శాంతి దినోత్సవం అని కూడా పిలుస్తారు. గ్లోబల్ ఫ్యామిలీ డే.. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచ శాంతి కోసం చేసిన ప్రయత్నాల ద్వారా మొదలైంది. ప్రపంచంలోని పిల్లల కోసం శాంతి మరియు అహింస కోసం అంతర్జాతీయ దశాబ్దాన్ని ప్రారంభించేందుకు 1997లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించింది. ఇందుకోసం ప్రతి సంవత్సరం తొలిరోజును ఇందుకోసం అంకితం చేయాలని.. 1999 లో యూఎన్ఓ నిర్ణయించింది. ఆ తర్వాత 2001 జనవరి 1 నుంచి గ్లోబల్ ఫ్యామిలీ డే గా జరుపుకుంటున్నారు.
శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండే కుటుంబాలు.. ప్రశాంతంగా జీవించే సమాజాలకు పునాది. శాంతియుత సమాజాలు శాంతియుత దేశాలు నిర్మిస్తాయి. ఇది చివరికి ప్రపంచాన్ని శాంతియుతంగా మారుస్తుంది. దీన్ని జరుపుకోవడం అంటే అందరం కలిసి సంతోషంగా, శాంతియుతంగా గడపడమే. ప్రతిరోజూ కలిసి రాత్రి భోజనం చేయడం.. కుటుంబ సభ్యుల మధ్య సమావేశాల ద్వారా మంచి సంభాషణ, అలాగే ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయడం, బంధాలను బలోపేతం చేయడం.. ఇవన్నీ శాంతిని పెంపొందించే మార్గాలుగా అభివర్ణిస్తున్నారు. వ్యక్తిగతంగా అహింసకు కట్టుబడి ఉండటం.. హింసకు వ్యతిరేకంగా మాట్లాడటం.. శాంతిని పెంపొందించే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేయడం.. ఇవన్నీ ఇందులో భాగంగా చెబుతారు. ఇది భిన్నత్వంలో సామరస్యం మరియు ఏకత్వాన్ని తీసుకురావడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
More Stories
48 స్థానాలతో బిజెపి విజయకేతనం
కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత