మేరీ గుడి.. హిందూ మతంపై దాడి

మనది కాని మతాన్ని, మనది కాని ఆచారాలను, మనవి కాని సంప్రదాయాలను మనవిగా చూపే దుర్మార్గమైన పనులకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రోమన్ కేథలిక్ చర్చ్‌లు ఒడిగడుతున్నాయి. అందులో భాగంగా హిందూ దేవాలయాలను పోలిన క్రిస్టియన్ చర్చ్‌లను నిర్మిస్తున్నాయి. హిందూ దేవతామూర్తులను తలపించేలా ఏసుక్రీస్తు, మరియ విగ్రహాలను ప్రతిష్టించి.. హిందూ మతాన్ని ఆచరించే వారిని క్రిస్టియానిటీ వైపు మళ్ళించే కుట్రలకు పాల్పడుతున్నాయి. అలాంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతుండగా.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని “నిర్మలగిరి” మేరీమాత “గుడి”.. అలాంటి క్రైస్తవ కుట్రలకు కేంద్రంగా నిలుస్తోంది. నిర్మలగిరి కేంద్రంగా క్రైస్తవ మిషనరీలు ఆడుతున్న నాటకాలను, హిందువుల్ని నమ్మించి మోసం చేస్తున్న వైనాన్ని మరింత వివరంగా ఈ కథనంలో చూద్దాం..

కొవ్వూరు పట్టణానికి సమీపంలో దేవరపల్లి మండలం, గౌరీపట్నం గ్రామంలో ఉంది.. నిర్మలగిరి మేరీ మాత “గుడి” కమ్ చర్చ్. అయితే.. అక్కడ కొబ్బరి కాయలు కొడతారు.. అగర వత్తులు వెలిగిస్తారు.. తల నీలాలను సమర్పిస్తారు.. అరటి పళ్ళను నైవేద్యంగా పెడతారు. హుండీలో కానుకలు స్వీకరిస్తారు. కంచు గంటలనూ మోగిస్తారు. మేరీ విగ్రహానికి పట్టు చీరలూ కడతారు. చూడటానికి అది కొండమీద హిందువుల గుడిలాగానే కనిపిస్తుంది. ఆలయ గోపురం, ప్రాకారం మొత్తం హిందూ దేవాలయాన్ని తలపిస్తుంది. కానీ.. అది గుడి కాదు.. హిందువులు ఆరాధించే అమ్మవారి ఆలయం అంతకన్నా కాదు. అది జీసస్ క్రైస్ట్ మదర్ మేరీ పేరిట నిర్మించిన టెంపుల్ కమ్ చర్చ్. ఏటా లక్షలాది మంది హిందువుల్ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసేందుకు రోమన్ కేథలిక్ క్రిస్టియన్ మిషనరీ ఆడుతున్న దారుణమైన నాటకానికి కేరాఫ్ అడ్రస్ నిర్మల గిరి మేరీ టెంపుల్.

రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో 1979లో ఓ చిన్న చర్చ్‌గా ప్రారంభమైన ఈ మేరీ టెంపుల్ ఇప్పుడు 90 ఎకరాల సామ్రాజ్యంగా ఎదిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు డెల్టా, అటు ఏజన్సీ మెట్ట ప్రాంతాల మధ్య గౌరీపట్నం గ్రామం ఉండటంతో.. ఈ ప్రాంతంలో నివశించే హిందువులే టార్గెట్‌గా మేరీ టెంపుల్ పని చేస్తోంది. హిందూ సమాజాన్ని మభ్యపెట్టి తమవైపు తిప్పుకునే కుట్రల్లో భాగంగా.. ఇక్కడ క్రీస్తు తల్లి మేరీని.. మేరీ”మాత”గా పిలవటం మొదలుపెట్టారు. ఆమె విగ్రహానికి సైతం అమ్మవారికి అలంకరించినట్టుగా పట్టుచీర కట్టి.. పూలు పెట్టి పూజలు చేయటం మొదలు పెట్టారు.

అంతే కాదు.. కొబ్బరి కాయలు కొట్టటం, అగరవత్తులు వెలిగించటం, తల నీలాలు సమర్పించటం వంటి అనేక హిందూ సంప్రదాయాలను మక్కీకి.. మక్కీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. హిందువులు నిత్యం వెళ్ళే గుళ్ళు, గోపురాలకు వెళ్ళాల్సిన పనిలేదని.. మేరీ మాత “గుడి”లో కూడా మీరు పూజలు చేసుకోవచ్చని.. ఏసు క్రీస్తును నమ్ముకోవచ్చంటూ ఇక్కడి పాస్టర్లు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. నిరక్షరాస్యులైన గ్రామీణులు, రైతులు, గిరిజనులు, మహిళలు వీరి మాటలు నిజమే అనుకుని నమ్మి.. మోసపోతున్నారు. క్రమ క్రమంగా హిందూ ఆలయాలకు దూరమై.. క్రిస్టియానిటీ బాట పడుతున్నారు.

వాస్తవానికి.. నిర్మలగిరి మేరీ టెంపుల్లో రోమన్ కేథలిక్ మిషన్ నిర్మించిన నిర్మాణాలు చూస్తే మతిపోవటం ఖాయం. వాటిని చూసిన వారెవరైనా హిందూ ఆలయమే అన్న భ్రమకు లోనవుతారు. నిర్మలగిరి కొండ మార్గంలో మొదటగా కనిపించే స్వాగత ద్వారం నుంచి మేరీమాత గాలిగోపురం, అంతరాలయం వరకు ప్రతీదీ హిందూ ఆలయాలను పోలిన విధంగానే కట్టేశారు. గాలి గోపురాన్ని సైతం హిందూ ఆలయం మాదిరిగానే నిర్మించిన పాస్టర్లు.. పైన మాత్రం శిలువను పెట్టారు.

గుడిలో ఏసు క్రీస్తు నిలువెత్తు విగ్రహం పెట్టి.. దాని ముందు కానుకల కోసం హుండీలను సైతం ఏర్పాటు చేశారు. కొబ్బరి కాయల కొట్టటం, అగరవత్తులు వెలిగించటం, దీపారాధన చేయటం ఇలా హిందూ సంప్రదాయంలో ఆచరించే ప్రతీ క్రతువును ఇక్కడ చేసేలా పక్కాగా ప్లాన్ చేశారు. సమీప గ్రామాల్లో ఈ మేరీ గుడి గురించి విస్తృతంగా ప్రచారం చేయటంతో.. అనతి కాలంలోనే ఈ గుడికి పాపులారిటీ పెరిగింది. రోమన్ కేథలిక్ మిషన్ ప్రచారకుల మాటలను నిజమని నమ్ముతున్న స్థానికులు పెద్ద సంఖ్యలో మేరీ టెంపుల్‌కు వెళుతున్నారు.

అలా.. మేరీ టెంపుల్ వరకు వచ్చిన వారిని.. సమీపంలో నిర్మించిన భారీ చర్చ్‌లోకి నిర్వాహకులు రప్పిస్తారు. అక్కడ క్రైస్తవ పద్దతిలో ప్రార్థనల్లో పాల్గొనేలా చేస్తారు. హిందూ దేవతలకు, క్రిస్టియానిటీలో మేరీ మాతకు తేడా లేదన్నట్టుగా ప్రచారం చేస్తారు. చివరకు.. స్థానిక హిందువుల్ని క్రిస్టియానిటీలో మారటానికి ఒప్పించి.. వారికి బాప్టిజం అంట గట్టటంతో.. ఈ ఆపరేషన్ మొత్తం విజయవంతంగా పూర్తవుతోంది.

ఇలా క్రిస్టియన్ మాయలో పడి బాప్టిజం తీసుకున్న వారు.. మరో 10 మందిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేలా సదరు మేరీ మాత గుడి నిర్వాహకులు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. అమాయక హిందువుల్నే తమ క్రైస్తవ మత ప్రచారంలో పావులుగా వాడుకుంటూ.. హిందూ మతంపై ఓ పథకం ప్రకారం దాడికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం నిర్మలగిరి మేరీ మాత గుడికి ఏటా లక్షలాది మంది వస్తున్నారంటే.. అక్కడ క్రైస్తవ మిషనరీ ఏ స్థాయిలో కన్వర్షన్స్‌కు పాల్పడుతోందో అర్ధం చేసుకోవచ్చు.