జమ్మూ కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పూంచ్ సెక్టార్ లో ఉగ్రవాదులు నక్కిన విషయం తెలుసుకున్న భారత ఆర్మీ జల్లెడ పడుతోంది. ఏకంగా ఆర్మీ చీఫ్ కూడా రంగంలోకి దిగారు. కాగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను, బాడీ సూట్ కెమెరాలను ఉపయోగించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు చైనా టెక్నాలజీతో తయారుచేసిన స్నిపర్ గన్స్ ను భారత సైనికులపై వినియోగిస్తున్నట్లు సమాచారం. నవంబర్ లో జమ్మూ సరిహద్దులో భారత సైనికుడిపై స్పినర్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

More Stories
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
నర్మదా తీరంలో ‘జాతీయ చలనచిత్ర అవార్డుల’ వేడుక
ఛత్తీస్‌గఢ్‌లో 14 మావోయిస్టుల డంప్‌లు గుర్తింపు