డా. భగవత్ బీహార్ పర్యటనలో భద్రతలో ఆందోళన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్  డా. మోహన్ భగవత్ మూడు రోజుల పర్యటనకై గురువారం బీహార్ చేరుకున్న సందర్భంగా భద్రతలో ఆందోళన వెల్లడైంది. శుక్రవారం కుప్పఘాట్‌లోని మహర్షి మెహి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ఊహించని మలుపు తిరిగింది.
 
కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన డాక్టర్ మోహన్ భగవత్ పర్యటన సందర్భంగా భద్రతా సిబ్బందిలో ఒక క్షణం గందరగోళం, ఆందోళన కనిపించింది. గురువారం డా. మోహన్ భగవత్ పాట్నా ఎయిర్‌పోర్టులో దిగి నేరుగా భాగల్పూర్ చేరుకున్నారు.  భాగల్పూర్ చేరుకున్న తర్వాత, ఆయన ఖలీఫాబాగ్ చౌక్‌లో ఉన్న నీరజ్ శుక్లా అనే సంఘ్ కార్యకర్త నివాసంలో బస చేశారు.
శుక్రవారం నిర్ణీత కార్యక్రమం అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ కుప్పఘాట్‌లోని మహర్షి మెహి ఆశ్రమాన్ని సందర్శించారు.  జిల్లా పోలీసులు, కేంద్ర సంస్థల భారీ భద్రతలో ఉన్న ఆశ్రమం వద్ద డాక్టర్ భగవత్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అయితే భద్రతా ఏర్పాట్ల మధ్య భద్రతా సిబ్బందిని ఆశ్చర్యపరిచే ఘటన చోటుచేసుకుంది. ఆశ్రమానికి డా. భగవత్ కు స్వాగతం పలికేవారి జాబితాను ముందుగానే సిద్ధం చేశారు. 
 
ప్రజలు డాక్టర్ భగవత్‌ను పలకరించగా, మున్నా బాబాగా గుర్తించబడిన అనుకోని అతిథి ఒక పుస్తకంతో ఆయన దగ్గరకు వచ్చారు. భాగల్‌పూర్‌లోని వెరైటీ చౌక్‌లో ఆలయ పూజారి అయిన మున్నా బాబా ఆ పుస్తకాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ డా. మోహన్ భగవత్‌కు అందజేసి ఆయన పాదాలను తాకేందుకు ప్రయత్నించారు.
 
మున్నా బాబా కాళ్ళ అద్దాలు, టోపీ విచిత్రమైన వేషధారణను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అనుమానంతో ప్రశ్నించగా, మున్నా బాబా తనను తాను కేంద్రమంత్రి అశ్విని చౌబేకి బావగా చెప్పుకుంటూ పరిచయం చేసుకున్నాడు. అయితే, అనుమానంతో భద్రతా అధికారులు మున్నా బాబాను ప్రశ్నించి, డాక్టర్ భగవత్‌కు దూరంగా ఉంచారు.
 
తదుపరి విచారణలో, మున్నా బాబా ముందుగా సిద్ధం చేసిన స్వాగతం  పలికేవారి జాబితాలో లేడని తేలింది. ఆశ్రమానికి తరచూ వచ్చే వ్యక్తిగానూ, ఆహ్వానం అందుకున్నప్పటికీ, అతని ఊహించని చర్యలు ఆందోళనకు గురిచేశాయి. విధి నిర్వహణలో ఉన్న ఒక ఐబి అధికారి ఈ సందర్భంగా జిల్లా పోలీసుల భద్రతా లోపాన్ని ఎత్తి చూపారు. 
 
దానితో అనుమానంతో అతనిని మరోసారి ప్రశ్నించినట్టు  డిఎస్పీ రౌషన్ గుప్తా కార్యాలయం ధృవీకరించింది. మున్నా బాబాని నిజంగానే ఆహ్వానించారని తరువాత స్పష్టం చేశారు. మున్నా బాబా ఆ ఆశ్రమానికి సాధారణ ఆహ్వానితుడని ఆల్ ఇండియా సెయింట్స్ సత్సంగ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ దివ్య ప్రకాష్ తెలిపారు.
  డా. భగవత్ సమీపంకు వెళ్లి అతను ప్రవర్తించిన తీరు అనుమానాలను రేకెత్తించి, అతనిని సమీపం నుండి తొలగించడానికి దారితీసిందని వివరించారు. ఈ సంఘటన హై-ప్రొఫైల్ సందర్శనల సమయంలో క్షుణ్ణమైన భద్రతా ప్రోటోకాల్‌ల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి లోపాలను నివారించడానికి ఖచ్చితమైన ప్రణాళిక అవసరం అని అధికారులు హితవు చెప్పారు.  కాగా, డా. భగవత్ ఆశ్రంలో సాదు సంతతులతో ఆరు గంటల సేపు గడిపారు. పలు అంశాలపై సమాలోచనలు జరిపారు.