విద్యుత్‌ అక్రమాలపై జ్యూడిషియల్ విచారణ

తెలంగాణలో పదేళ్ళ బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ విద్యుత్ రంగంపై శ్వేత పత్రాన్ని గురువారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి చర్చను ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆందోళన కరంగా ఉందని తెలిపారు. 
 
ఇప్పటివరకు విద్యుత్‌ రంగంలో రూ. 81 వేల కోట్ల అప్పు ఉందని చెప్పారు. 2014 వరకు రూ. 10 వేల కోట్ల లోపు అప్పులు ఉంటే బిఆర్ఎస్ గత తొమ్మిదనరేళ్లలో రూ. 81 వేల కోట్లకు తీసుకెళ్లారని వెల్లడించారు.  అయితే, విద్యుత్ రంగంలో భారీగా అప్పులు పేరుకుపోయాయని ప్రభుత్వం ప్రకటించడంపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి అభ్యంతరం తెలిపారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకుందంటూ  72014 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల్లో 44,438 కోట్లు ఆస్తులు ఉంటే 22,422కోట్లు అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.  ప్రభుత్వం మారే సమయానికి అప్పు రూ.81,516 కోట్లు ఉంటే, విద్యుత్ సంస్థలకు రూ. 1,37,570కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని గుర్తు చేశారు.
 
మధ్యలో కలుగజేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్ యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో రూ.20 వేల కోట్ల స్కామ్‌ జరిగిందని, అందులో జగదీష్‌రెడ్డి రూ.10 వేల కోట్లు తిన్నాడని ఆరోపించారు.  కోమటిరెడ్డి ఆరోపణలుపై జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయట పెట్టాలని సవాల్ చేశారు.
 
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్‌ మేరకు జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్లను కూడా చేరుస్తామని,  మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలు, భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌, యాద్రాద్రి పవర్‌ప్లాంట్‌పై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.
రెండేళ్లలో భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఏడేళ్లు పట్టింది. భద్రాద్రి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవలేదు. బ్యాక్‌ డోర్‌ నుంచి టెండర్లు అంటగట్టారని ధ్వజమెత్తారు.  ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ కూడా ఉత్పత్తి చేయలేదని మండిపడ్డారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ అంటూ అబద్ధాలు చెప్తున్నారంటూ సభలో దబాయిస్తూ ఇంకా ఎంత కాలం గడుపుతారు?. కోమటిరెడ్డి లాక్‌బుక్‌ చూపిస్తే బుక్‌లు మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.