అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్ 30న ఇండిగో తొలి విమానం

దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్ 30న తొలి విమానాన్ని నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెలాఖరులోగా సిద్ధమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా డిసెంబర్ 8న తెలిపారు.

విమానాశ్రయం నుంచి నడిచే తొలి విమానయాన సంస్థగా, అయోధ్య విమానయాన సంస్థకు 86వ దేశీయ గమ్యస్థానంగా ఉంటుందని ఇండిగో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023 డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి తొలి విమానం అయోధ్యకు రానుంది. 

2024 జనవరి 6 నుంచి ఢిల్లీ- అయోధ్య మధ్య డైరెక్ట్ ఫ్లైట్, 2024 జనవరి 11 నుంచి అహ్మదాబాద్- అయోధ్య మధ్య వారానికి మూడు వారాల విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఢిల్లీ, అహ్మదాబాద్- అయోధ్యలకు కలిపే కొత్త విమానాలు అయోధ్యను దేశ విమానయాన పటంలో తీసుకువస్తాయని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు.

కాగా, అయోధ్యలో నిర్మించిన శ్రీరామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 25న ప్రారంభంకానున్నది. ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదిన సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పనులు సిద్ధం కావడంతో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రులు జ్యోతిరాధిత్య సింధియా, వీకే సింగ్‌ విమానాశ్రయాన్ని పరిశీలించారు. 
 
పెండింగ్‌ పనులన్నీ 15లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. విమానాశ్రయం పనులను మూడు దశల్లో నిర్వహించనున్నారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం 821 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి అప్పగించారు. తొలి దశలో 220 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడెల్పుతో రన్‌ వేను ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో దీన్ని 3750 మీటర్లకు విస్తరించే అవకాశం ఉన్నది. 
 
ఈ విమానాశ్రయంలో పొగమంచు, రాత్రిపూట ల్యాండింగ్‌ చేసేలా క్యాట్‌-1, రెసా పనులను పూర్తి చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌ సిద్ధమైంది. అయోధ్య ధామ్ విమానాశ్రయంలో ఎయిర్‌బస్ ఏ320 తదితర విమానాలను సైతం ల్యాండింగ్‌ చేసే సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం.