శిలాజ ఇంధనాల ప్రస్తావనే లేకుండానే కాప్‌ 28 ముసాయిదా

శిలాజ ఇంధనాలను దశల వారీగా నిర్మూలించే ప్రస్తావనే లేకుండా కాప్‌ 28 ముసాయిదాను ప్రచురించారు. దుబారు ఆతిథ్యంలో జరుగుతున్న కాప్‌ 28 సదస్సు సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఐరాస వాతావరణ విభాగం ముసాయిదాను ప్రచురించింది. 

ఇందులో గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి దేశాలు తీసుకోవల్సిన చర్యల గురించి మాత్రమే ప్రస్తావించారు. శిలాజ ఇంధనాలను దశల వారీగా నిర్మూలించే ప్రస్తావనే లేకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ ముసాయిదాలో గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను వేగంగా, స్థిరంగా తగ్గించాల్సిన ఆవశ్యకత గురించి, తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి పేర్కొన్నారు.

ప్రచురించిన ముసాయిదా వివరాలు

  • (ఎ) ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడం. 2030 నాటికి ప్రపంచ సగటు వార్షిక పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుదల రేటును రెట్టింపు చేయడం.
  • (బి) వేగంగా బొగ్గు వినియోగాన్ని తగ్గించడం. నూతన థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు అనుమతిపై పరిమితులు విధించడం.
  • (సి) బొగ్గు ఆధారిత ఇంధన వినియోగాన్ని తగ్గించడం. ఇలాంటి ప్రయత్నాలను ప్రపంచవ్యాప్తంగా వేగవంతం చేయడం.
  • (డి) శిలాజ ఇంధన ప్రత్యామ్నాయం వైపు ప్రయత్నాలను వేగవంతం చేయడం.
  • (ఇ) 2050 నాటికి లేదా అంతకంటే ముందుగా శిలాజ ఇంధనాల వినియోగం. ఉత్పత్తి రెండింటినీ న్యాయంగా, క్రమబద్ధంగా, సమానమైన పద్ధతిలో తగ్గించడం.
  • (ఎఫ్‌) 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కర్బనేతర ఉద్గారాలను.. ప్రధానంగా మీథేన్‌ ఉద్గారాలు వేగవంతంగా, గణనీయంగా తగ్గించడం.
  • (జి) నడకదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి, తక్కువగా ఉద్గరాలను విడుదల చేసే వాహనాల అభివృద్ధి వంటి మార్గాలు ద్వారా ఉద్గరాలను వేగంగా తగ్గించడం.
  • (హెచ్‌) శిలాజ ఇంధన సబ్సిడీలను వీలైనంత త్వరగా తొలగించడం.