సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులకు విరుద్ధంగా ఉన్న ఈ సూచనలు సవరణ చట్టంలో పొందుపరచడం వల్ల తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని వారు అభిప్రాయపడినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనలలో ఒకటి అక్రమ సంబంధాలకు చెందిన నేరాలు కాగా, రెండవది స్వలింగ సంపర్కానికి చెందిన నేరాలు ఉన్నట్లు వర్గాలు వివరించాయి.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న భారతీయ న్యాయ సంహిత బిల్లు, 2023లో అక్రమ సంబంధాలకు చెందిన నేరాలను తిరిగి పొందుపరచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే సుప్రీంకోర్టు 2018లోనే ఈ నేరాన్ని కొట్టివేసింది. ఇది మహిళల పట్ల వివక్షతతో కూడుకుని ఉన్నదని, మహిళల గౌరవ మర్యాదలకు భంగకరంగా ఉందని సుప్రీంకోర్టులో తన తీర్పులో పేర్కొంది.
భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377 ప్రకారం సమ్మతిలేని శృంగారం శిక్షార్హం చేయాలని స్టాండింగ్ కమిటీ చేసిన రెండవ సిఫార్సు. అయితే పరస్పర సమ్మతితో మైనారిటీ తీరిన స్వలింగ సంపర్కుల శృంగారం నేరం కాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ అంశాన్ని కొత్త చట్టంలో చేర్చాలని వారు కోరుతున్నారు.

More Stories
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంలో భిన్నాభిప్రాయం
కావేరి నదీ జలాల వివాదంలో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకోలేవు
జైష్ ఉగ్రవాది గాలింపు కోసం కాశ్మీర్లోని 5 జిల్లాల్లో హై అలర్ట్