తెలంగాణాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

* సాయంత్రం 5 గంటలకు 64 శాతం పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చితమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువతీయువకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. 
ఫలితంగా సాయంత్రం 5 గంటలకు ఓటింగ్‌ ముగిసేసరికి 63.94 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
అయితే 5 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.  అత్యధికంగా మెదక్‌ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించారు.
గ్రామీణ‌, సెబీ అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గాల‌లో భారీ పోలింగ్ జ‌రిగింది.. విద్యాధికులు అధికంగా ఉన్న హైద‌రాబాద్ లో పోలింగ్ స‌ర‌ళి దారుణంగా ఉంది..2019 లో ఇక్క‌డ 50 శాతం ఓటింగ్ న‌మోదు కాగా, ఈసారి ఆ మార్క్ చేరుకోవ‌డం క‌ష్టంలో క‌నిపిస్తున్న‌ది. ఇది ఇలా ఉంటే 2019లో మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో మొత్తం 73శాతం పోలింగ్ జ‌రిగింది.. ఈసారి కూడా ఆ శాతానికి అటు ఇటుగా ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది.  రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 
 
ఈ ప్రజాస్వామ్య పండుగలో సాధారణ ఓటర్లతో పాటు సెలబ్రిటీలూ ఓటేసేందుకు పోటెత్తారు. సాధారణ పౌరుల్లా క్యూలో నిల్చని మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 3,26,18,205 మంది ఓటర్లలో ఎంత శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలియాల్సి ఉంది. సాయంత్రం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. డిసెంబర్‌ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో మహేందర్ రెడ్డిని అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగిందని కధనాలు వెలువడ్డాయి. ఈ ఘటనలో పాక్షికంగా కారు. ధ్వంసమైంది. అయితే, ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా భర్త మహేందర్ రెడ్డిపై ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని ఆ తర్వాత రాచకొండ పోలీసులు స్పష్టం చేశారు.