వివేక్ సంస్థల్లో రూ. 200 కోట్ల అక్రమ లావాదేవీలు

కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో గత మంగళవారం సోదాలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వివేక్ కు చెందిన కంపెనీల్లో రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలను జరిగినట్లు గుర్తించామని ప్రకటించారు.  విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో వివేక్ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లు తెలిపింది.  ఫెమా చట్టం కింద వివేక్‌పై కేసు లు నమోదు చేసినట్లు ఇడి పేర్కొంది.

నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. గడ్డం వివేక్ తన భార్య, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఎలాంటి వ్యాపారం లేక పోయినా భారీగా లావాదేవీలు జరిపినట్లు పేర్కొంది. యశ్వంత్ రియాలిటీతో పాటు వివేక్ భార్య పేరిట భారీగా కొనుగోళ్లు చేసినట్లు, పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని ఈడీ తెలిపింది. 
వివేక్ సంస్థల్లో రూ.8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై పోలీసుల ఫిర్యాదుపై సోదాలు చేశామని చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్‌, ఎంఎస్‌ సెక్యూరిటీ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈ డబ్బు ఎంఎస్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ రాబడి కాదని తేలిందని వెల్లడించారు.  వివేక్ వ్యాపార సంస్థల్లో రూ.20 లక్షల ఆదాయమే గుర్తించామని ఈడీ తెలిపింది.
ఆస్తులు, అప్పులు కలిపి రూ.64 కోట్లతో బ్యాలెన్స్‌ షీట్‌ ఉంటే లావాదేవీలు మాత్రం రూ.200 కోట్లకు పైగా గుర్తించామని వివరించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటివరకు 20 ల క్షల రూపాయల టాక్స్ చెల్లించినట్లు సోదా ల్లో గుర్తించినట్లు ఇడి తెలిపింది.
 ‘రూ.8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై ఫిర్యాదు అందింది. పోలీసుల ఫిర్యాదు మేరకు సోదాలు చేశాం. విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగాయి. డబ్బు విజిలెన్స్ సెక్యూరిటీ రాబడి కాదని తేలింది.  వ్యాపారం ద్వారా రూ.20 లక్షల ఆదాయమే వచ్చింది. ఆస్తులు, అప్పులు కలిపి రూ.64 కోట్లతో బ్యాలెన్స్ షీట్ ఉంది. లావాదేవీలు మాత్రం రూ.200 కోట్లకు పైగా గుర్తించాం. కంపెనీలను వివేక్ పరోక్షంగా నియంత్రిస్తున్నారు’ అని ఈడీ వివరించింది. 
`విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థకు యశ్వంత్ రియల్టర్స్ మాతృ సంస్థ. యశ్వంత్ రియల్టర్స్‌లో విదేశీయుల షేర్లు ఎక్కువగా ఉన్నాయి. వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశంలో సంస్థ ఏర్పాటు చేశారు. సోదాల్లో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాం. దర్యాప్తులో భాగంగా విజిలెన్స్ సెక్యూరి టీ సంస్థ బోగస్‌గా తెలుస్తోంద’ని ఇడి అధికారులు తమ ప్రకటనలో వెల్లడించారు.
వివేక్‌ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాల్లో కంపెనీ ఏర్పాటు చేశారని తెలిపింది. ఈ సోదాల్లో భారీగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రూ.కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఈడీ ప్రకటించింది. ఈ దర్యాప్తులో భాగంగా ఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్‌ నకిలీ సంస్థ అని ఈడీ అధికారులు గుర్తించారు.

మాజీ క్రికెటర్ల నివాసాల్లో ఈడీ సోదాలు

మరోవంక,  మొన్నటి వరకు రాజకీయ నాయకులే లక్ష్యంగా దాడులు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు తాజాగా హైదరాబాద్ కు చెందిన మాజీ క్రికెటర్ల నివాసాలలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేపట్టాయి. మాజీ క్రికెటర్లు శివలల్ యాదవ్, అర్షద్ అయ్యబ్ మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జి.వినోద్ నివాసాలలో ఈడి అధికారులు బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు.

 ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో ఈ ముగ్గురు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఎసిబి నమోదు చేసిన మూడు కేసుల ఆధారంగా ఈడి ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. శివ లాల్ యాదవ్, అర్శాధ్ అయ్యాబ్, వినోద్ ల బ్యాంక్ ఖాతాలు, గత లావాదేవీలు, విలువైన పలు డాక్యుమెంట్లను ఈడి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈసారి గడ్డం వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు.  ఆయన తమ్ముడే గడ్డం వివేక్.