హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడే వారికే ఓటేయండి

సనాతన హిందూ దర్మ పరిరక్షణ కు కట్టుబడే వ్యక్తులు, పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని బృందావనంలోని శ్రీ ఆనంద ధామ్ పీఠంకు చెందిన సద్గుర ఋతేశ్వర జీ మహరాజ్ తెలంగాణాలో ఎన్నికల సందర్భంగా పిలుపునిచ్చారు.  ఓటు ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రం లాంటిదని అంటూ ఓట్ చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటని నిర్ణక్ష్యం వహిస్తే భవిష్యత్తులో దేశం విషయంలోనే కాక తమ ఇంట్లోని వారి పరిస్థితిలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.  

అంతే గాకుండా ఇటీవల కాలంలో హింధూ సనాతన ధర్మంపై దాడులు జరిపే పార్టీలు, నాయకులు ఎక్కువైనా హిందూ ఓటర్లు పట్టించుకోకుండా వదిలేస్తే రేపు ఇంట్లోని ఆడవారు బయట తిరిగే పరస్థితి ఉండదనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు.  హైదరాబాద్ లోని  గోషామహల్ లోని సీతారాం భాగ్ లో ఉన్న పురాతన రామ మందిరంలో జరుగుతున్న భారత భాగ్య సమృద్ది యజ్ఞాన్ని సందర్శించిన నేపధ్యంలో ఆదివారం ఆయన మీడియా ప్రతినిథులతో మాట్లాడారు.

హిందూ సనాతన ధర్మంపై పలు కోణాల నుంచి దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ వాటిని తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉందని సద్గురు ఋతేశ్వర జీ మహరాజ్ తెలిపారు.  భాగ్యనగరంలో ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన భాద్యతను ప్రతి హైందవ బంధూ గుర్తెరిగి పరిరక్షించకపోతే రేపు తమ తమ సురక్షతను కోల్పోయిన వారవుతారని హెచ్చరించారు.

ఇంగ్లీషు భాషను వదలి మాతృభాషలో మాట్లాడడాన్ని చిన్న చూపు మానడం మాని గర్వపడాలని ఆయన సూచించారు.  ఈ సనాతన ధర్మం, భారతీయతను నాశనం చేసే వారి పట్ల జాగురూకతతో, అప్రమత్తతతో వ్యవహరిస్తూ తమ తమ సంస్కృతిని హైందవ సమాజం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.  సనాతన ధర్మం మన జీవన పద్దతి అని చెబుతూ అందరూ కలసి ఈ భారతీయత మూలాలను కాపాడుకుంటూ అందరూ ఒకటేనని చాటాలని కోరారు.

ముందుగా యాగశాలకు చేరుకొన్న సద్గురు ఋతేశ్వర జీ మహరాజ్ బృందానికి యజ్ఞ నిర్వాహకురాలు శ్రీమతి మాధవి లత స్వాగతం పలికారు.  యజ్ఞ వాటికలో సత్కారాలు అందుకొన్న తర్వాత సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి మాధవి లత 45 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టడాన్ని అభినందించారు. ముఖ్యంగా మెకాలే విద్యా విధానం కారణంగా భారతీయ సమాజంలో కొంత మేర ఆత్మ నూన్యతా భావం ఏర్పడుతోందని పేర్కొంటూ దీనిని సమూలంగా మార్చడానికి త్వరలో రాబోయే నూతన విద్యావిధానం దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఋతేశ్వర జీ తెలిపారు.

మెకాలే విద్యా విధానం ప్రధానంగా భారతీయులలో బానిసత్వాన్ని పెంపొందించడానికి రూపొందించిన విధానమని అంటూ ముఖ్యంగా భారతీయ సాంస్కృతిక పరంపరను ధ్వంసం చేయడమే కాకుండా సనాతన ధర్మంపై విషం కక్కడం ప్రధాన లక్ష్యంగా ఈ విధానం రూపొందించడం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  

ఈ బానిసత్వాన్ని పారదోలాలంటే హిందువులు తమ ధర్మానికి ప్రతీకగా భావించే తిలకాన్ని ఎళ్లవేలలా ధరించాలని తద్వారా తాము వేసుకొన్న దుస్తులు ఏవైనా నివసిస్తున్న దేశం ఏదైనా తాము సనాతన హిందువనే విషయాన్ని గర్వంగా తెలియచెప్పవచ్చని వివరించారు.  ఇప్పటికైనా భారతీయులు ముందుకు వచ్చి వేల సంవత్సరాల సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో హైందువులు రామ మందిరం కోసం పోరాడి త్వరలోనే రామ మందిరం ప్రారంభించుకోబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఇక కాశీ విశ్వనాధ మందిర విముక్తి తో పాటూ శ్రీ కృ,ష్ణ జన్మస్థానాన్ని బానిస సంకెళ్లనుండి త్వరలోనే హైందవ సమాజం విడిపించుకోబోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ దిశగా హిందూ సమాజం అడుగులు వేయాలంటే హైందవ దర్మాన్ని పాటించే వారికి ఓటు వేయడం తప్పనిసరి అని గుర్తు చేశారు.