నాంపల్లి అగ్నిప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య

నాంపల్లి బజార్ ఘాట్ లోని బాలాజీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఈనెల 13న జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 10 మందికి పెరిగింది. ఈ నేపథ్యంలో భవన యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  భవన యజమాని రమేష్ గత కొన్ని రోజులుగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో అక్రమంగా కెమికల్స్ ను విక్రయిస్తున్నాడు. 

పలు మార్లు జైలుకు వెల్లోచ్చిన రమేష్ తన తీరును మార్చుకోకుండా అలానే అక్రమంగా కెమికల్స్ విక్రయం కొనసాగిస్తూ వచ్చాడు.  గ్రౌండ్ ఫ్లోర్ లోని డ్రమ్స్ లో కెమికల్స్ ను నిలువ ఉంచాడు రమేష్. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా చిన్న నిప్పు రవ్వ తో మొదలైన మంటలు 10 మందిని బలి తీసుకున్నాయి.

ఆ డ్రమ్స్ లో కెమికల్స్ నిలువ ఉన్నందునే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. దీంతో రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ నిందితుడు రమేష్ గతంలో అనేక సార్లు రెసిన్ డ్రమ్ములు అలానే నిల్వ ఉంచుతూ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు తెలిపినా అతని పంతు మార్చుకోలేదని చెప్పారు.

నవంబర్ 11న సాయంత్రం నిందితుడు రమేష్ 35 కిలోల రెసిన్ ఉన్న డబ్బాలను కొనుగోలు చేశారని కొనుగోలు చేసిన ఆ డబ్బాలను గ్రౌండ్ ఫ్లోర్ లో నిలువ ఉంచడాని తెలిపారు. అపార్ట్మెంట్ ఎదురుగా పిల్లలు బాణసంచా కాల్చుతున్న క్రమంలో చిన్న నిప్పు రవ్వ డబ్బాలో పడి అగ్ని ప్రమాదానికి దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. 

నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 304, 285, 286 కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన తల్హా నాసర్ (17) అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందడంతో మృతుల సంఖ్య 10కి చేరింది.