తెలంగాణాలో కుటుంబ పార్టీల పాలనను ఓడించండి

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కుటుంబ పార్టీ పాలనను ఓడించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, రాక్షసుల పార్టీ అని విమర్శించారు.
 
రాష్ట్రంలోని జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని నడ్డా స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌​కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదని తెలిపారు.
 
“ప్రత్యేక రాష్ట్ర ఫలితాలు ప్రజలకు అందలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ కుటుంబానికే లబ్ధి జరిగింది. ఈనెల 30న కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించేవి. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అధికంగా నిధులు కేటాయించారు. కుటుంబ పాలనను అంతమొందించాలి” అని తెలిపారు. రాబోయే ఎన్నికలు తెలంగాణ స్వరూపాన్ని మార్చే ఎన్నికలని చెప్పారు. 
 
జమ్మూకశ్మీర్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబపార్టీలు ఉన్నాయని పేర్కొంటూ రాబోయే ఎన్నికల్లో కుటుంబ పార్టీ పాలనను ఓడించాలని ప్రజలను కోరారు జేపీ నడ్డా. దేశంలో కుటుంభ పాలనను అంతం చేయగల పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలని చెబుతూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ  అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు.
 
తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు అంతా వారిదే రాజకీయ అధికారమని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉందని తెలిపారు. ధరణి పోర్టల్‌ ద్వారా పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆ ర్‌​కు ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఒక కేసీఆర్ కుటుంబానికి లబ్ధి జరిగిందని.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందడం లేదని ధ్వజమెత్తారు.
 
 కేసీఆర్‌ అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని జేపీ నడ్డా ఆరోపించారు. మియాపూర్‌ భూముల్లో రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగిందని విమర్శించారు. దళితబంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్‌ ఇవ్వాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ అంటే `భ్రష్టాచారుల రాక్షస సమితి’ అని పేర్కొంటూ కేసీఆర్ తన పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ లలో ఎవ్వరిని ఎన్నుకున్న అవినీతి పరిపాలనే అందిస్తారని ఆయన హెచ్చరించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. బిజెపికి ఓటేసి కేసిఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాల్లో `డబల్ ఇంజిన్’ ప్రభుత్వాలతో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు.