ఒరిగిన సంఘ శిఖరం రంగహరి

 
* మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబెల్ సంతాపం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జేష్ఠ కార్యకర్త, దేశంలోని జీవించిన వారిలో సీనియర్ ప్రచారక్, గతంలో అఖిల భారతీయ బౌద్ధిక ప్రముఖ్ గా పనిచేసిన రంగహరి (93) సోమవారం ఉదయం 7:45 నిమిషాలకు ఎర్నాకులంలోని అమృత హాస్పిటల్ లో మృతి చెందారు.  ఆయన పార్థివ శరీరం ఎర్నాకులంలోని మాధవ నివాస్ ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యాలయం చేరుకొంది.

సోమవారం ‘తానల్’ నిరాశ్రిత బాలుర ఆవాసం, ఓట్టప్పాలెం, పాలక్కాడ్ తీసుకువెళ్తారు. “భారతఫ్ఫుళా” నది ఒడ్డున ఐవర్ మఠ్ ప్రాంగణంలో అంతిమ సంస్కారాలు జరుపుతారు. దశాబ్దాల కాలంగా కేరళలో సంఘకార్య విస్తరణకు జీవన పర్యంతం పనిచేశారు.  స్థానికంగా కేరళ ప్రాంత ప్రచారకులుగా బాధ్యతలు నిర్వహించి తదనంతరం అఖిల భారతీయ సహ బౌద్ధిక్ ప్రముఖ్ గా, అఖిల భారతీయ  బౌద్ధిక్ ప్రముఖ్ గా అనేక సంవత్సరాలు పనిచేశారు.
ఆ విభాగానికే కాకుండా దేశంలోని ప్రజల ఆలోచనలో మార్పు రావడానికి కావలసిన నెరెటివ్స్ తయారుచేయడంలో విశేషంగా కృషి చేశారు.  “లోకమంథన్” వంటి వేదికల మాధ్యమంగా మన దేశ ప్రజల ఆలోచన ధోరణిని దేశభక్తి ధర్మనిష్ఠ వైపు మళ్ళించడం కోసం, దేశంలోని ప్రచార యంత్రాంగానికి హిందుత్వం కేంద్ర బిందువు కావడానికి ఆయన చేసిన ప్రయోగాలనేకం సఫలమయ్యాయి.
 
డిసెంబర్ 5, 1930 న జన్మించాడు (రోహిణి, వృశ్చికం). సంఘ్ మొదటిసారి నిషేధంకు గురైన సమయంలో బిఎ చదువుతున్న ఆయన డిసెంబర్ 1948 నుండి ఏప్రిల్ 1949 వరకు కేరళలో జైలు గడిపారు. బీఏ డిగ్రీ పొందిన తర్వాత సంస్కృతం విడిగా చదివారు. ఆ తర్వాత 1951 మే 3న సంఘ్ ప్రచారక్‌గా బయటకు వచ్చారు. 
 
ఏడాదిపాటు తాలూకా ప్రచారక్‌గా పనిచేశారు. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో జిల్లా ప్రచారక్‌గా, ఆ తర్వాత కేరళలోని వివిధ ప్రాంతాల్లో విభాగ్ ప్రచారక్‌గా పనిచేశారు. ఎమర్జెన్సీ, సంఘ్ పై రెండోసారి నిషేధం సమయంలో (జూన్ 25, 1975 – మార్చి 21, 1977) రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్, లోక్ సంఘర్ష్ సమితి కార్యక్రలాపాలను కేరళలో అజ్ఞాతంలో ఉండి నడిపించిన ముగ్గురు ముగ్గురు ప్రముఖులలో ఆయన ఒకరు. 
 
ప్రాంత ప్రచారక్ కె. భాస్కర్ రావు, సీనియర్ ప్రచారక్ పి.మాధవ్ లతో కలిసి అజ్ఞాత ఉద్యమాన్ని నడిపించారు. ఆ సమయంలో అజ్ఞాతంలో మలయాళంలో నడిపిన పత్రిక కురుక్షేత్రంకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఎమర్జెన్సీ తర్వాత, కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచురణ విభాగం కురుక్షేత్రను ప్రారంభించేందుకు ఆయన నియమించారు.
 
1980లో కేరళ ప్రాంత్ బౌధిక్ ప్రముఖ్‌గా బాధ్యతలు స్వీకరించారు.  1981లో ప్రాంత ప్రచారక్ భాస్కర్ రావు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా విశ్రాంతి తీసుకోవలసి వచ్చినప్పుడు తాత్కాలిక ప్రాంత ప్రచార్‌గా బాధ్యతలు చేపట్టారు. 1983 నుండి 1994 వరకు కేరళ  ప్రాంత్ ప్రచారక్‌గా పనిచేశాడు. 
 
1990లో, అఖిల భారతీయ సహబౌధిక్ ప్రముఖ్‌గా,  1991లో బౌధిక్ ప్రముఖ్‌గా ఎంపికయ్యారు. 2005 వరకు ఆ బాధ్యతలో కొనసాగారు. ఆయన ఆసియా, ఆస్ట్రేలియాలలో హిందూ స్వయంసేవక్ సంఘ్‌కు 1994 నుండి 2005 వరకు ప్రభారిగా ఉన్నారు. దీనికి సంబంధించి, ఐదు ఖండాలకు చెందిన 22 దేశాలలో పర్యటించారు.
 
2001లో లిత్వేనియాలో జరిగిన క్రైస్తవ పూర్వ మతాల ప్రపంచ సదస్సులో,  ఆ తర్వాత 2005, 2006లలో భారత్‌లో రెండుసార్లు పాల్గొన్నారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారి మండల సభ్యునిగా కొనసాగారు. 2006 నుండి ఎటువంటి అధికారిక బాధ్యత లేకుండా సంప్రదింపుల సామర్థ్యంతో పని చేస్తున్నారు.
 
ప్రస్తుత సాధారణ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల నుండి తప్పుకున్న అయిన తర్వాత, ఆరోగ్యం అనుమతించినప్పుడు రచనలు, ఉపన్యాసాలు ఇవ్వడం కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. హరిజీ మలయాళం, సంస్కృతం, హిందీ, కొంకణి, మరాఠీ, తమిళం, ఆంగ్లంలలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని పొందారు.
 
అతను గొప్ప రచయిత.  మలయాళం, హిందీ, ఇంగ్లీష్, కొంకణి భాషలలో అనేక పుస్తకాలు రాశారు.  మలయాళంలో మూడు పుస్తకాలు, శ్రీ గురూజీ రచనల ఒక భారీ సేకరణ – హిందీలో ‘శ్రీ గురూజీ సమగ్ర’ 12 సంపుటాలలో సంకలనం చేశారు. ఆయన శ్రీ గురూజీ జీవిత చరిత్రను హిందీలో రాశారు. దివంగత కె. భాస్కర్‌ రావుజీపై ఆయన చేసిన కృషి అత్యంత ప్రామాణికమైన విశ్లేషణ.
 
రంగహరి మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హాసభలే ప్రగాఢ సంతాపం తెలిపారు. రంగా హరి లోతైన ఆలోచనాపరుడు, ఆచరణాత్మక కార్యకర్త, ఆదర్శ స్వయంసేవక్, అన్నింటికంటే ఎక్కువగా ప్రేమయంతో అందరిని ప్రోత్సహించేవారని నివాళులు అర్పించారు. 
రంగ హరి తన జీవితాన్ని సంపూర్ణంగా, అర్థవంతంగా గడిపారని కొనియాడారు.
ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ బౌధిక్ ప్రముఖ్‌గా ఉన్నప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడిన పలువురు కార్యకర్తలు ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.  అనారోగ్యంతో తన  చివరి రోజుల్లో తన శక్తి విఫలమైందని పూర్తిగా తెలిసిన్నప్పటికీ చదవడం, రాయడం, తనను చూడటానికి వచ్చిన స్వయంసేవకులను ఆహ్లాదకరంగా మార్గదర్శనం చేయడం  వంటి కార్యకలాపాలను మానుకోలేదని గుర్తు చేసుకున్నారు.
 
అక్టోబరు 11న, పృథ్వీ సూక్త్‌పై ప్రచురించిన ఆయన వ్యాఖ్యానం ఢిల్లీలో ఆవిష్కరించిన విషయాన్నీ గుర్తుచేశారు. మాట్లాడలేకపోతున్నా కూడా, ఆయన సందర్శకుల మాటలు విని తన ముఖ కవళికల ద్వారా ప్రతిస్పందించారని తెలిపారు.