కేరళలో హమాస్ కు పెరుగుతున్న మద్దతుతోనే పేలుళ్లు

* సిపిఎం, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలపై బిజెపి మండిపాటు
కేరళలో ఒక చర్చి లో జరిగిన పేలుడు సంఘటనకు ఇటీవల రాష్ట్రంలో  “ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం నేపథ్యంల” హమాస్ తీవ్రవాదులకు పెరుగుతున్న రాజకీయ మద్దతే కారణమని బిజెపి స్పష్టం చేస్తుంది.   రాష్ట్రంలో జరుగుతున్న “క్రైస్తవ సమావేశాలకు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలు” పై విచారణ జరపాలని  కేంద్ర మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు వి మురళీధరన్ కోరారు.
 
కేరళ బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ మాట్లాడుతూ, “పాలస్తీనా అనుకూల, హమాస్ అనుకూల వైఖరి నేపథ్యంలో ఈ సంఘటనను చూడాలి” అని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్, సీపీఎంల బుజ్జగింపు రాజకీయాలకు అమాయక ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు.
 
రాష్ట్ర పోలీసుల ప్రకారం, యెహోవాసాక్షుల సమావేశంలో పేలుడు ఒక ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఇడి) వల్ల సంభవించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) వంటి కేంద్ర ఏజెన్సీలు ఈ ఘటనపై ఇప్పటికే తమ దర్యాప్తును ప్రారంభించాయని మురళీధరన్ తిరువనంతపురంలో విలేకరులతో తెలిపారు.
 
సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్),  కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)లు హమాస్ లకు సానుభూతి కలిగించే విధంగా లేవనెత్తుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంతో ఇప్పటికే కేరళలో వేడిగా ఉన్న సమయంలో పేలుడు సంభవించింది.
 
ప్రధాన రాజకీయ పక్షాలు సాంప్రదాయకంగా పాలస్తీనా పోరాటాలకు మద్దతు ఇస్తున్నాయి. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించడానికి, పాలస్తీనియన్లకు సంఘీభావం ప్రకటించడానికి రాష్ట్రంలో ప్రదర్శనలు, సమావేశాలు కూడా జరిపారు. ఈ సందర్భంగా బుజ్జగింపు ఆరోపణలను తప్పించుకోవడానికి ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ రెండూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి.
 
జమాతే ఇస్లామీ యువజన విభాగం సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్ శుక్రవారం మలప్పురంలో నిర్వహించిన పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ మాజీ చీఫ్ ఖలీద్ మషాల్ ప్రసంగించడంపై బీజేపీ ఆదివారం ప్రధాన స్రవంతి పార్టీలను విమర్శించింది.
 
“రాష్ట్రంలోని ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల నుండి హమాస్‌కు పెరుగుతున్న మద్దతు మధ్య ఈ పేలుడు జరిగింది. ఈ రాష్ట్రంలో హమాస్ నాయకులు ప్రత్యక్షంగా హాజరయ్యే సమావేశాలు, కార్యక్రమాలను మేము చూశాము. మరో సమావేశంలో హమాస్ నాయకుల వర్చువల్ ప్రసంగం చేశారు” అని సురేంద్రన్ తెలిపారు.
 
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో ముస్లిం మద్దతు సమీకరించుకొనేందుకు  వాటా వామపక్షాలు, కాంగ్రెస్ ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటి సమావేశాలు, మరియు పాలస్తీనాకు మద్దతు ఉందని సురేంద్రన్ ఆరోపించారు.
 
“రాష్ట్రంలో పిఎఫ్‌ఐకి బలమైన మద్దతు ఉంది, సిపిఎం,  కాంగ్రెస్ రెండూ ఇప్పుడు దానిలో ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ మద్దతు వెనుక కారణం అదే, ”అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు స్పష్టం చేశారు.  ఎర్నాకులంలో గతంలో కూడా చిన్న పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. “ఇది ఉగ్రవాద సంస్థల పట్ల ప్రధాన స్రవంతి పార్టీల మృదువైన విధానం ఫలితం,” అని ధ్వజమెత్తారు.
 
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్‌పై తన పోస్ట్‌లో “కాంగ్, సిపిఎం పార్టీల బుజ్జగింపు రాజకీయాలకు ఎల్లప్పుడూ అన్ని వర్గాల అమాయకులు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది చరిత్ర మనకు నేర్పింది. నిరాడంబరమైన బుజ్జగింపు రాజకీయాలు కేరళలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి, ‘జిహాద్’కి పిలుపునిచ్చేందుకు, ఉగ్రవాద హమాస్‌ను ఆహ్వానించడం కాంగ్రెస్/సీపీఎం/యూపీఏ/ఇండియా కూటమిల సిగ్గుచేటు చర్య. ఇది బాధ్యతారహిత పిచ్చి రాజకీయాల ఎత్తు” అని మండిపడ్డారు.
 
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ను ఉటంకిస్తూ, కేంద్ర మంత్రి ఇలా చెప్పారు: “మీరు మీ పెరట్లో పాములను ఉంచుకోలేరు.  అవి మీ పొరుగువారిని మాత్రమే కాటు వేయాలని ఆశించకూడదు. మీకు తెలుసా, చివరికి ఆ పాములు పెరట్లో ఉన్నవారిపై తిరగబోతున్నాయి”. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నాయకులు ఈ సంఘటనను ఖండించడానికికే పరిమితమయ్యారు. దర్యాప్తు ఏజెన్సీలు ఏమి కనుగొంటారో అందరూ వేచి ఉండాలని పిలుపునిచ్చారు. 
 

అనుమానిత వ్యక్తి లొంగుబాటు

 
పే ఈ పేలుళ్లకు సంబంధించి 48 ఏళ్ల అనుమానిత  వ్యక్తి కోడక్కర పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు కేరళ ఎడిజిపి (లా అండ్‌ ఆర్డర్‌) అజిత్‌ కుమార్‌ తెలిపారు. డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి, ఆదివారం ఉదయం క్రైస్తవ బృందం యెహోవాసాక్షులు ప్రార్థనా సమావేశం జరుగుతున్న జమ్రా కన్వెన్షన్ సెంటర్‌లో బాంబును అమర్చినట్లు అంగీకరించాడు.


 తాను యెహోవాసాక్షుల సభ్యుడినని చెప్పుకున్న మార్టిన్, తాను క్రైస్తవ బృందం  కార్యకలాపాల్లో సంస్కరణలు చేపట్టాలని కోరుతున్నానని, తన డిమాండ్లను పట్టించుకోకపోవడంతో బాంబులు పేల్చినట్లు పోలీసులకు తెలిపాడు. అయితే, యెహోవాసాక్షుల ప్రతినిధి తమకు మార్టిన్ గురించి తెలియదని, కన్వెన్షన్ సెంటర్ సమావేశానికి ఆయనను ఆహ్వానించలేదని స్పష్టం చేశారు.