రెండు లక్షల మందికి పైగా బాలికలపై పాస్టర్ల అత్యాచారం

స్పెయిన్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చికి సంబంధించి చాలా దిగ్భ్రాంతికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండు లక్షలకు పైగా మైనర్ బాలికలు లైంగిక దాడికి గురయ్యారు. క్యాథలిక్ పాస్టర్లు వారిని సెక్స్ బొమ్మలుగా మార్చేశారు. చర్చిలోని సాధారణ సభ్యులు చేసే నేరాల వ‌ల్ల నాలుగు లక్షల మంది బాలికలు లైంగిక దోపిడీకి గురయ్యార‌ని వెల్ల‌డైంది.

ఒక ఇండిపెండెంట్ కమిషన్ 8,000 మందికి పైగా ప్రజలతో మాట్లాడింది. అందులో దాదాపు 0.6 శాతం మంది లైంగిక వేధింపులకు గురైనట్లు అంగీకరించారు.  స్పెయిన్ జనాభా 39 మిలియన్లు. ఇందులో 0.6 శాతం అంటే రెండు లక్షల జనాభాకు సమానం. చిన్నతనంలో చర్చికి వెళ్లినప్పుడు పాస్టర్లు తమను లైంగిక దోపిడీ చేశారని చాలామంది చెప్పారు.

పాస్టర్లే కాకుండా, చర్చిలోని ఇతర సభ్యులపై కూడా చాలా మంది తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాథలిక్ చర్చిపై గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ లైంగిక వేధింపులు తరచుగా పిల్లలపై జరగడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. స్పెయిన్ సాంప్రదాయకంగా క్యాథలిక్ దేశంగా పరిగణించబడుతుంది. 

కానీ ఇప్పుడు లౌకిక దేశంగా మారింది. బాధితులకు పరిహారం అందించేందుకు జాతీయ నిధిని రూపొందించాలని నివేదిక విజ్ఞప్తి చేసింది. ఇటువంటి ఆరోపణలపై విచారణ జరిపేందుకు గత మార్చ్ లో పార్లమెంట్ ఓ స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది.