జీతాలివ్వ‌కుంటే… పాక్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ జ‌ట్టు పేవ‌ల ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తొంది. టోర్నీలో భ‌గంగా ఇప్ప‌టి వ‌ర‌కు పాక్ జ‌ట్టు 6 మ్యాచులు ఆడగా మొద‌టి రెండు మ్యాచుల్లో మిన‌హా మ‌రో మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌లేదు. చివరకు ఆఫ్ఘానిస్తాన్ చేతిలో కూడా ఓటమి ఎదురు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
వన్డే వరల్డ్‌ కప్‌ – 2023లో  వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిన  పాకిస్తాన్‌ సెమీస్‌ రేసు నుంచి  నిష్క్రమించింది. 
ఏదైనా అద్భుతం జరిగితే  తప్ప  పాకిస్తాన్‌  గ్రూప్‌ స్టేజ్‌  నుంచి ముందంజ వేయడం అసాధ్యం. దక్షిణాఫ్రికాతో   తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆఖరివరకూ పోరాడినా ఆ జట్టుకు   ఓటమి తప్పలేదు.  పాకిస్థాన్ ఇలా వ‌రుస‌గా మ్యాచులు ఓడిపోతుండ‌టంతో కెప్టెన్ బాబ‌ర్ ఆజాం స‌హా మిగిలిన ఆట‌గాళ్లు అందరిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇంకా బాధ్య‌తాయుతంగా ఆడాల్సి ఉంద‌ని అభిమానుల‌తో పాటు మాజీ ఆట‌గాళ్లు మండిప‌డుతున్నారు.

ఈ నేపథ్యంలో  పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి  రషీద్‌ లతీఫ్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై సంచలన ఆరోపణలు చేశాడు. గడిచిన ఐదు నెలలుగా  పీసీబీ.. ఆటగాళ్లకు జీతాలు ఇవ్వడం లేదని  ఆరోపించాడు. గత కొద్దిరోజులుగా  పాకిస్తాన్‌ క్రికెటర్లకు, బోర్డుకు మధ్య  సఖ్యత కొరవడిందని,  జట్టులో కూడా విభేదాలు తారాస్థాయికి చేరాయని  వార్తలు వస్తున్నాయి.  

బాబర్‌ను వరల్డ్‌ కప్‌ తర్వాత  సారథిగా తప్పిస్తారని పాకిస్తాన్‌ మీడియా కోడై కూస్తోంది. తన పొజిషన్‌తో పాటు జట్టుకు మద్దతు గురించి మాట్లాడటానికి  బాబర్‌ పీసీబీ పెద్దలను సంప్రదిస్తున్నా వాళ్లు స్పందించడం లేదని  తెలుస్తున్నది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మ‌న్‌కు గ‌త రెండు రోజులుగా కెప్టెన్ బాబ‌ర్ ఆజాం మెసేజ్‌లు చేస్తున్న‌ప్ప‌టికీ వారి ఎలాంటి స్పంద‌న లేదు. 

ఓ కెప్టెన్ తోనే వారు మాట్లాడ‌కుంటే ఎలా? అని ల‌తీఫ్ ప్ర‌శ్నించారు. వారు ఈ విధంగా చేయ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి? ఆ విష‌యాలు తెలియ‌డం లేదు. పీసీబీలో ఏం జ‌రుగుతోందో అర్థం కావ‌డం లేదని చెప్పుకొచ్చాడు. 

ఇక‌, ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఆట‌గాళ్లు సంత‌కం చేసిన సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ల ఒప్పందాన్ని పునః ప‌రిశీలిస్తామ‌ని పీసీబీ చెప్పింది. దీంతో గత ఐదు నెల‌లుగా పాక్ ఆట‌గాళ్ల‌కు జీతాలు అంద‌లేదు. అలాంట‌ప్పుడు ఆట‌గాళ్ల నుంచి ఇంత‌కంటే మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ను ఎలా ఆశించ‌గ‌లం అని అంటూ ల‌తీఫ్ ర‌షీద్ పీసీబీ తీరును త‌ప్పుబ‌ట్టాడు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత  ఓ టీవీ ఛానెల్‌లో  లతీఫ్‌ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌ మీడియాలో చాలా విషయాలు  చక్కర్లు కొడుతున్నాయి.  బహుశా అవన్నీ ఫేక్‌ న్యూస్‌. నేను మీకు అసలైన  నిజాలు చెబుతున్నా. గత రెండ్రోజుల నుంచి  బాబర్‌ ఆజమ్‌ పీసీబీ చీఫ్‌తో పాటు సీవోవోను కాంటాక్ట్‌ అవుతున్నాడు. కానీ వాళ్లు  అతడికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదు. పాకిస్తాన్‌ ప్లేయర్లకు గడిచిన ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు.  వరల్డ్‌ కప్‌కు ముందు  ఆటగాళ్ల కాంట్రాక్టులను పునఃపరిశీలిస్తామని  పీసీబీ చెప్పింది. కానీ ఇంతవరకు అది ఓ కొలిక్కి రాలేదు.  జీతాలు లేకుండా వాళ్లు ఎలా ఆడతారు..?’ అని ప్రశ్నించాడు.