లూటీలు, దోపిడీ, లైంగికదాడి కేసుల్లో ముస్లింలు నంబర్‌ వన్‌!

క్రైం రేటులో ముస్లింలు టాప్‌ ప్లేస్‌లో ఉన్నారంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్  (ఎఐయుడిఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్  సంచలనం కలిగించే వ్యాఖ్యలు చేశారు. లూటీలు, దోపిడీలు, లైంగికదాడి వంటి నేరాలకు పాల్పడటంలో ముస్లింలు అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో జరిగిన ఓ పూర్వ విద్యార్థుల సభలో మాట్లాడుతూ ముస్లిం  యువత చదువులో వెనుకబడి ఉండటంతో నేరాలలో ఎక్కువగా కనిపిస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మనం జైళ్లకు వెళ్లడంలో కూడా నంబర్ వన్ అని వ్యాఖ్యానించారు. చదువు లేకపోవడంతోనే ముస్లింలు అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అసోంలో తీవ్ర దుమారమే రేగింది. పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తున్నప్పటికీ ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. తానేమే తప్పుగా మాట్లాడలేదని సమర్ధించుకున్నారు.
 
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీ విద్యకు దూరంగా ఉండటం తాను చూశానని తెలిపారు. ఉన్నత విద్య అటుంచితే కనీసం మెట్రిక్యులేషన్‌ కూడా పూర్తి చేయలేకపోతున్నారని తెలిపారు. ఈ కారణంగానే నేరాల రేటు అధికంగాఉందని చెప్పారు.  బహిరంగ ప్రదేశాల్లో మహిళలను చూసినపుడు తమ కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారని యువకులు గుర్తుంచుకోవాలని సూచించారు. వారు తమ తల్లులు, సోదరీమణుల గురించి ఆలోచిస్తే లైంగిక వేధింపులకు పాల్పడరని పేర్కొన్నారు. 
“మహిళలను చూసిన తర్వాత లైంగికంగా ఉత్సాహంగా ఉంటామని చెప్పే అబ్బాయిల కోసం  నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రవర్తించడానికి తగిన మార్గం ఉందని ఇస్లాం చెబుతుంది. మనం మార్కెట్‌కి లేదా ఏదైనా బహిరంగ ప్రదేశానికి వెళ్లి స్త్రీలను చూసినప్పుడు, మనం దూరంగా చూడాలి. తమ కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారని గుర్తుంచుకోవాలి.. తమ తల్లులు, సోదరీమణుల గురించి ఆలోచిస్తే వారికి ఎప్పుడూ అనుచితమైన ఆలోచనలు రావు’’ అని బద్రుద్దీన్ అజ్మల్  హితవు చెప్పారు. 
ముస్లిం యువత విద్య, ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. యువత చదువుకోవాలనే ఉద్దేశంతోనే తాను అలా అన్నానని వెల్లడించారు. “ప్రజలు చంద్రుడు, సూర్యుని వద్దకు వెళుతున్నారు. కానీ, జైలుకు వెళ్లడం ఎలా? అనే దానిపై మనం పీహెచ్‌డీ చేస్తున్నాము. పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లండి. అక్కడ ఎక్కువగా ఎవరు ఉన్నారో మీకు తెలుస్తుంది – అబ్దుర్ రెహ్మాన్, అబ్దుర్ రహీం, అబ్దుల్ మజీద్, బద్రుద్దీన్, సిరాజుద్దీన్, ఫక్రుద్దీన్, ఇది బాధాకరమైన విషయం కాదా?” అని ప్రశ్నించారు. ముస్లిం యువకులకు విద్య, ఉపాధి ప్రాముఖ్యతను గుర్తించాలని అజ్మల్ కోరారు.
ముస్లిం సమాజం అభివృద్ధి చెందకపోవడానికి అక్షరాస్యత తక్కువగా ఉండటం పెద్ద కారకంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే అందుకు మనం ప్రభుత్వాన్ని నిందిస్తుంటామని చెప్పారు. కానీ మన సమాజంలోని వారినే నిందించాల్సి ఉంటుందని తెలిపారు. 
అక్షరాస్యత పెద్ద సమస్య.. చదువుకోలేదు.. చదువు విషయంలోనే ప్రభుత్వాన్ని నిందిస్తాం.. కానీ మన మైనారిటీ ప్రాంతం నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని అడిగితే ఇవ్వలేకపోవడం చాలా దౌర్భాగ్యం. మన అక్షరాస్యత రేటును పెంచాలి. మన యువత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడం కంటే వేరే మార్గం లేదు. విద్య లేకపోవడం వల్లనే అన్ని చెడులు ప్రబలుతున్నాయి” అని బద్రుద్దీన్ అజ్మల్ తేల్చి చెప్పారు.
కాగా, అసోంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏఐఈడీఎఫ్‌ ఒకటి. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు.