98 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రస్థానం

రాంపల్లి మల్లిఖార్జునరావు,                                                                                                                                                          ఆర్ఎస్ఎస్ పూర్వరంగం -1

ప్రముఖ సామాజిక విశ్లేషకులు

1925సంవత్సరం విజయాలకు చిహ్నమైన విజయదశమి పండుగ రోజున ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్ఎస్ఎస్) ఈ విజయదశమికి, 98 సంవత్సరాలు పూర్తి చేసుకుని 99 వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది.  నేడు దేశమంతా విస్తరించిన సంఘం పని అంటే 1. శాఖా పని 2. సమాజంపని. శాఖల విస్తరణే సంఘం వ్యవస్థ విస్తరణ.  శాఖలు  ఈరోజు దేశంలో భౌగోళికంగా చిన్న వ్యవస్థ అయిన  మండలాలకు కూడా విస్తరిస్తున్నది. శాఖలు ఈరోజు దేశవ్యాప్తంగా షుమారు 70వేలు ఉంటాయి.

సమాజం పనిలో భాగంగా సంఘ కార్యకర్తలు దేశంలో అన్ని ప్రముఖమైన జాతీయ జీవన రంగాలలో ప్రవేశించి వేగవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళుతున్నారు  ఈ పనులు చేయటంలో సంఘం స్వాతంత్ర పూర్వము  నుండిఅనేక సమస్యలను ఎదుర్కొంటు ముందుకు సాగుతున్నది. రాజకీయ సంస్థల నుండి,  రకరకాల సిద్ధాంతాల నుండి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ తన ప్రయాణాన్ని సాగించింది. రాజకీయాల్లో తిరుగులేని, ఎదురులేని కాంగ్రెస్ పార్టీ సంఘాన్నిఎప్పుడు తన ప్రత్యర్థిగానే భావిస్తూ ఏ చిన్న అవకాశం దొరికిన దాడులు చేసేది, కాంగ్రెస్ సంఘాన్ని  మూడుసార్లు నిషేధించింది.

1.గాంధీజీహత్యా నేరంపై, 2. ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకునేందుకు కోర్టు తీర్పును ధిక్కరిస్తూ దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో  సంఘాన్ని కూడా నిషేధించింది. 3. 1992 లో అయోధ్యలో బాబర్ కట్టడం కూల్చివేతసమయం.

అట్లాగే సైదాంతికదాడులు  భౌతిక దాడులు  కూడా ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ  సంఘం ఈరోజు  ఒక శక్తివంతమైన వ్యవస్థగా, సంస్థగా  వికసించి దేశానికి కేంద్ర బిందువుగా మారింది.

ఈ దేశం  ఇండియన్ జాతా  లేక ప్రాచీన హిందూ రాష్ట్రమా ?

పరమ పూజనీయ డాక్టర్ జి  రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్నిప్రారంభించటానికి  దారితీసిన  దేశ పరిస్థితులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొందాము. ఆ పరిస్థితులు ఈ రోజున  కూడా ఇంకా ఏ రకంగా కొనసాగుతున్నాయి  అనేటటువంటిది మనకు అర్ధమౌతుంది.

ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 మొదటి స్వాతంత్ర పోరాటం ఒక కీలక ఘట్టం.  1857 తదుపరి ఈ దేశం బ్రిటిష్ పార్లమెంటు చేతిలోకి వెళ్ళిపోయింది.  దాంతో బ్రిటిష్ పార్లమెంటు ఈ దేశంలోని  బ్రిటిష్ ఇండియా భూభాగంలో ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ నిర్మాణం చేయటానికి  సన్నాహాలు ప్రారంభించింది.  1857 తదుపరి దేశ స్వాతంత్ర పోరాటం కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య  వ్యవస్థకు అనుకూలంగా ఈ దేశంలో అనేక సంస్థలు ప్రారంభమైనాయి. స్వాతంత్ర పోరాటం కోసం ఆ సంస్థలు  పనిచేస్తూ, రాజకీయాలను  వంట పట్టించుకుని ఎన్నికల్లో  పోటీచేయటం  కూడా ప్రారంభమైంది. ఆ సంస్థల వివరాలు:

1.1885 డిసెంబర్లోకాంగ్రెస్, 2. 1906  నవంబర్ 30న ముస్లింలీగ్,  3. 1914లో  అమృత్ సర్ లో  హిందూ మహాసభ, 4. 1920 అక్టోబర్ 17న సోషలిస్ట్ రిపబ్లిక్ సంస్థగా కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలు, వివిధ సిద్ధాంతాల ప్రభావం ఆ సంస్థల  మీదపడింది.  దాని కారణంగా ఆ సంస్థల ఆలోచనలు, సిద్ధాంతాలు, వాళ్ళు సృష్టించిన  కథనాలు ఎట్లా  ఉన్నాయో  ఒకసారి చూద్దాం:

1.ఆంగ్లేయులు ఈ దేశంలో  తమ పాలను సుస్థిరం చేసుకునేందుకు వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ దేశం యొక్క శక్తి ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించి ఆ శక్తిని బలహీనం చేసేందుకు  ఇక్కడ ఉండే ప్రజల్లో భేదాభిప్రాయాలు నిర్మాణం చేయాలని తీర్మానించుకున్నారు. దానితో ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఒకటి ఈ దేశం మీద వదిలిపెట్టారు. దానిని పాఠ్యాంశంగా చేసి పూర్తి క్రిందికి తీసుకెళ్లారు.

ఆ సిద్ధాంతం ప్రకారం  ఈ దేశం ఎవరిది కాదు ఇది ఒక సత్రం లాంటిది ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎప్పుడో ఒకప్పుడు బయటి నుంచి వచ్చిన వారు, అంటే ఈ దేశం మీద మొదట ఆర్యులు  దండయాత్ర చేశారు,  గ్రీకులు, శకులు,  హుణులు , ముస్లింలు,  ఫ్రెంచ్,  పోర్చుగీస్,డచ్   వాళ్ళు వచ్చారు చిట్ట  వరకు ఆంగ్లేయులైన మేము వచ్చాము. కాబట్టి మనందరం ఇక్కడ కలిసి ఉండాలి అనేటువంటి మాట చెప్పుకుంటూ వచ్చారు.

అంటే దీని అర్థం ఇది ఒక దేశం కాదు ఇది ఒక జాతి కాదు. ఈ దేశం లో ప్రజలు ఇప్పుడిప్పడే ఇండియన్ జాతిగా నిర్మాణమౌతున్నారు అనేభ్రమ కలిగించారు.  ఇండియన్స్ ఇండియన్ జాతి అనే భేద తంత్రం లో మన ఆలోచనలు చిక్కుకుపోయినాయి.

2. ఐరోపా ఖండంలోభాష ఆధారంగా జాతి  సిద్ధాంతం ప్రారంభమైంది అదే  ఐరోపాఖండం చీలి పోవడానికి దారితీసింది.  జాతి అంటే భాషా,  మతము, భూభాగం ఉండాలని తీర్మానించారు. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం  భారతదేశం ఒక దేశం కాదు ఒక జాతి కాదు ఇది  ఇక ఉపఖండము అని అన్నారు.ఇది  అనేక జాతుల సమూహారమన్నారు.  ఇక్కడ ఏ జాతి అయినా తమ  స్వతంత్రం కోసం పోరాటం గనుక చేస్తే వాళ్లకు మేము సంపూర్ణంగా   సహకరిస్తామని చెప్పారు. వీళ్ళు తెలుగుజాతి తమిళజాతి, కన్నడజాతి అంటూ మాట్లాడుతూ ఉంటారు.

  1. ముస్లింలుఈదేశం రెండు జాతులు ఉన్నాయని చెప్పారు ఒకటి హిందువులు రెండు ముస్లిములు.
  2. తమిళనాడులోద్రావిడసిద్ధాంతం తమిళ దేశం, తమిళ భాష, తమిళ జాతి,  అని మాట్లాడేవారు

5.కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం మనం ఇప్పుడిప్పుడే ఇండియన్  జాతిగా నిర్మాణం అవుతున్నాము   అంటే వేల సంవత్సరాలు గా ఉన్న ఈ జాతి నిఈ దేశాన్ని  ఇది ఒక దేశం కాదు ఒక జాతి కాదుఇక్కడ  ఒక సంస్కృతి లేదు అనేటువంటి మాటలు మాట్లాడటం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది   కేవలం 160,  170 సంవత్సరాల కి పూర్వం  ఈ దేశంలో ప్రారంభ మైన ఆ సిద్ధాంతాలు  ఈ దేశాన్ని  గందరగోళంలో పడేశాయి. అంతేకాదు ఈ దేశం వాళ్ళ తాతల ఆస్తి అన్నట్టుగా ఈ దేశాన్ని రకరకాలుగా ముక్కలు చేయాలని తీర్మానిస్తున్నారు.

మహమ్మద్ అలీ జిన్నా  ఈ దేశంలో ముస్లింలకు ఒక దేశం సృష్టించాలని ప్రయత్నాలు  ప్రారంభం చేసాడు.  జిన్నా  తమిళనాడులోని రామస్వామి నాయాకర్ ను  కలిసి ఈ దేశాన్ని మూడు దేశాలుగా మనం ముక్కలు చేయాలని చెప్పాడు.  1. ఇస్లామిస్తాన్  2.  హిందుస్థాన్ 3. ద్రవిడిస్టాన్. అంతేకాదు పంజాబ్ వాళ్ల కు  సిక్కు స్తాను కూడా మనం ఏర్పాటు చేయాలని అన్నారు.

అంటే ఈ దేశంలో ఎవరికి తోచిన రీతిలో వారు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని తీర్మానించుకుని ఎవరికి వాళ్లు పనిచేయటం ప్రారంభించారు.ఈ గందరగోళ పరిస్థితుల్లో పరమ పూజనీయ  డాక్టర్ జి కాంగ్రెస్ సంస్థనుండి   బయటకు వచ్చి  ఈ దేశం హిందువుల దేశము ఇది హిందూ రాష్ట్రము ఈ హిందూ రాష్ట్రాన్ని సంఘటితం చేయాలి తద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకుని వెళ్లాలని తీర్మానించుకుని రాష్ట్రీయ స్వయంసేవక  సంఘాన్ని ప్రారంభించారు.

అంటే దేశంలో ఉన్న గందరగోళ పరిస్థితుల్లో ఈ దేశం ఎవరిది ఈ దేశంలో మనం ఎవరం అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ డాక్టర్ జి సంఘ కార్యాన్ని ప్రారంభించారు.  ఈ విషయాలను అర్ధం చేసుకున్నప్పుడు సంఘం యొక్క నేపథ్యం మనకు పూర్తిగా అర్థమవుతుంది.

బ్రిటిష్ వాళ్లకు ఇది హిందూ రాష్ట్రం అంటే హిందుత్వమే భారత జాతీయయత అంటే, హిందూ ధర్మం అంటే ఎందుకు అంత భయం? ఎందుకంటే ఇస్లాం ఆక్రమణ సమయంలో,  1857 స్వాతంత్ర్య పోరాటం సమయంలో ధర్మరక్షణకుహిందువులు చేసిన భయంకరమైన పోరాటాల చరిత్ర వాళ్ళకి తెలుసు కాబట్టి మనం హిందువులం అనే విషయం మర్చిపోవాలి అందుకే హిందుత్వం అంటే మతతత్వం.  ధర్మమంటే మతం అని కథనాలు సృష్టించి వదిలిపెట్టారు.

160,  170 సంవత్సరాల క్రితం వదిలిన ఈ కథనాలు ఇంకా మనలను పూర్తిగా వదిలిపెట్టలేదు అని చెప్పటం అతిశయోక్తి కాదు. కాబట్టి ఇటువంటి గందగోళ  పరిస్థితుల్లోఇది హిందూ రాస్ట్రం మనం హిందువులం అనేసత్య సిద్ధం తో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేక సంఘము ఇవాళ దేశానికి కేంద్రబిందువుగా మారింది.

రాజకీయాలతో సంబంధం లేని ప్రజా సంఘాలు

రాష్ట్రీయ  స్వయంసేవ సంఘం సామాజిక క్షేత్రంలో సామాజిక రంగాలలో పనిచేసుకుంటూ వస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలలో భాగంగా  సమాజంలో అనేక రంగాలలో సంఘాలు ఏర్పడ్డాయి,  కార్మికరంగం , విద్యారంగం, వ్యవసాయ రంగం, ఇట్లా అనేకమైన పనులు విభజన జరిగింది.దాని కనుగుణంగా ఆ కాలంలోనే దేశంలో ఏర్పడిన కమ్యూనిస్టులు కాంగ్రెస్  మొదలైన వాళ్లు  ఆ  పనులు కూడా ప్రారంభం చేశాయి.

1948 నుండి  సంఘం కూడా దానికి అనుగుణంగా రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని సామాజిక రంగాలలో ప్రవేశించి పనిచేయటం ప్రారంభించింది.  ఆ సంస్థలు ఈ రోజు  దేశంలో జాతీయ స్థాయిలో కొన్ని మొదటి స్థానంలో,  కొన్ని ఏకైక స్థానంలో పనిచేస్తున్నాయి. సంఘ పరిభాషలో వాటిని వివిధ క్షేత్రాలు అంటారు  అటువంటివి అఖిలభారత  స్థాయిలో 35 నుంచి 40 వరకు ఈరోజు పని చేస్తున్నాయి.

పాశ్చాత్య  భావజాలంలో, సామ్యవాద భావజాలంలో దేశం కొట్టుకుని పోతుంటే భారతీయ ఆలోచనలకు అనుగుణంగా వివిధ క్షేత్రాలు పని చేస్తూ రాజకీయాలకు అతీతంగా దేశం లో వ్యవస్థ పరివర్తన  చేసుకొంటూ వస్తున్నది. సంఘము అంతే చేస్తున్నదా? ఇంకేమైనా చేస్తున్నదా? అంటే ప్రజలలో దేశ సమస్యల పట్ల అవగాహన కలిగించేందుకు జనజాగరణ కార్యక్రమాలు సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు  సంఘం ప్రారంభం నుండి చేసుకొంటూ వస్తున్నది.   

మచ్చుకు కొన్ని ప్రయత్నాలు

  1. 1947 నుండిఐదు సంవత్సరాల పాటు కాశ్మీర్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలుచేసారు.  1952జూన్ 26న పార్లమెంటు భవనం ముందు 15 వేల మంది ప్రజలు ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించారు,  దానితో కాశ్మీర్ సమస్య యావత్   దేశంలో ప్రజల దృష్టికి వచ్చింది.
  2. అస్సాంపరిరక్షణకోసం 1981లో   చేసిన ప్రయత్నాలలో అస్సాంలో ఓటర్ల జాబితా నుండి విదేశీయుల పేర్లు తొలగించాలని ఉద్యమం చేసింది.  ఎన్నికల కమిషనర్ కు ఒక వినతి పత్రాన్ని  సమర్పించింది,  `సేవ్ అస్సాం టుడే సేవ్ ఇండియా టుమారో’ అనే పేరుతో ఒక జాతీయ సదస్సు కూడా నిర్వహించబడింది.  1983 ఆగస్టు 15 నుండి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది.
  3. 1981లో  దేశమంతాఉలిక్కిపడే సంఘటన ఒకటి తమిళనాడు ప్రాంతంలోజరిగింది.  తీరుక్వేల్లి జిల్లాలో  మీనాక్షిపురం గ్రామంలో వెయ్యి మంది దళిత హిందువులను ఒకేసారి  ఇస్లాం మతంలోకి మార్చారు.  దీనిపై దేశమంతా ఆందోళన చెందింది.  అప్పటి ప్రధాని  ఇందిరాగాంధీ కూడా ఒక్కసారి ఆందోళనకు  గురి అయ్యి తన మనసులోని మాటలను వాజపేయి  గారితో పంచుకోంది. ఈ సందర్భంగా  దేశవ్యాప్తంగా  పెద్ద ఎత్తున  జన జాగరణ కార్యక్రమం జరిగింది. అట్లాగే  సంస్కృతి రక్షణ కోసం సంస్కృతి రక్షా నిధి సేకరణ జరిగింది.
  4. 1983 అక్టోబర్9నహిమాచల్ ప్రదేశ్ నుండి భారత మాత గంగా మాత రథయాత్రలు ప్రారంభమైనాయి. దేశవ్యాప్తంగా నాలుగు ప్రధాన రథాలు తిరిగాయి,  ఈ రథయాత్రలు  50 రోజుల పాటు జరిగాయి.  నేపాల్ లోని పశుపతినాథ్ దేవాలయం నుండి రామేశ్వరం వరకు సాగింది . నేపాల్ బర్మా భూటాన్ లలో కూడా జరిగింది. ఈ యాత్రలు  దేవత్థాన ఏకాదశి నుంచి గీతా జయంతి వరకు దేశమంతా జరిగాయి
  5. 5. అయోధ్యలోరామమందిర నిర్మాణం కోసం 1986 నుండి ప్రయత్నం ప్రారంభమై క్రమంగా దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకొంది దేశవ్యాప్తంగా రెండు లక్షల 75 వేల గ్రామాల నుంచి రామశిలలు పూజించి పంపబడ్డాయి.  దేవాలయ నిర్మాణం కోసం దేశంలో ఆరు కోట్ల మంది రామభక్తులు ఒక రూపాయి 25 పైసలు నిధిని కూడా  సమర్పించారు.  1990 అక్టోబర్ 30న మొదటి కరసేవ  జరిగింది.  1992 డిసెంబర్ 6న జరిగిన రెండవ కరసేవలో ఆగ్రహం తో ఉన్న రామ భక్తులు  బాబ్రీ కట్టడాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆ స్థలంలో చిన్న రామ మందిరం నిర్మాణం చేసారు. ఈ రోజు అయోధ్యలో రామజన్మ భూమిలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరుగుతున్నది

జన జాగరణ కార్యక్రమాలు 

అట్లాగే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రజలను భాగస్వాములు చేస్తూ అనేక వేదికల ద్వారా  జన జాగరణకార్య క్రమాలునిర్వహించింది. వాటిలో 1.  గో  సంరక్షణకు 1952 లో ఒక మహా ఉద్యమం సాగింది . దేశమంతట  నుండి 1,75,39,813 మందితో సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి సమర్పించారు. 2. స్వదేశీ ఉద్యమం, 3.  శివాజీ పట్టాభిషేకం జరిగి మూడు వందల సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా, 4.  గురు గ్రంథ సాహెబ్ 400 సంవత్సరంలో ప్రవేశం. 5.  నారాయణ గురు జయంతి 6.  శ్రీ మాత జయంతి 7. 1857 స్వాతంత్ర పోరాటం జరిగి 150. సంవత్సరాలు  పూర్తి అయిన సందర్భంగా కార్యక్రమాలు  8. వివేకానంద చికాగో సభలో మాట్లాడి 1993 నాటికి 100 సంవత్సరాలు పూర్తి అయిన సం దర్భంగా దేశవ్యాప్త కార్యక్రమాలు.   9. రామసేతు సంరక్షణ ఆందోళన కార్యక్రమం. 10.తిరుమల తిరుపతి సంరక్షణ ఉద్యమం ఇటువంటివి అనేకం జరిగాయి.

(రెండో భాగం బుధవారం)