రెండు వారాలుగా మొత్తం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఇజ్రాయిల్- హమాస్ యుద్ధంలో ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న 222 మంది భవిష్యత్ కీలకంగా మారింది. వారిని బేషరతుగా విడుదల చేస్తే కాల్పుల విరమణ గురించి చర్చలు జరుపుతానని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. వారిని విడిపించుకోవడం కోసమే తాము గాజా భూతలంపై యుద్ధంకు సిద్ధపడుతున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది.
బందీలను విడిచి పెట్టేందుకు ఒక వంక ఐక్యరాజ్యసమితి, మరోవంక జోర్డాన్, ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ నెల 7న ఇజ్రాయిల్ పై అకస్మాత్తుగా దాడి జరిపిన హమాస్ లు నిరాయుధులైన పౌరులను బందీలుగా పెట్టుకొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు ఇప్పుదు స్పష్టం అవుతుంది.
ఇజ్రాయెల్ సెక్యూరిటీస్ అథారిటీ (ఐఎస్ఎ) సోమవారం విడుదల చేసిన ఒక వీడియో క్లిప్‌లో అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడులలో హమాస్ ఉగ్రవాదులు తమ చురుకైన భాగస్వామ్యాన్ని ఒప్పుకున్నట్లు చూపుతున్నారు. ఐఎస్ఎ కమ్యూనికేషన్స్ అందించిన వీడియో ఫైల్‌ను హమాస్ ఉగ్రవాదుల ప్రకటనలకు జోడించారు.
వీడియోలో, ఇజ్రాయెల్ నుండి గాజాకు పౌరులను బందీలుగా తీసుకున్నందుకు తమకు స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారని పట్టుబడిన హమాస్ ఉగ్రవాదులు చెప్పినట్లు వినిపిస్తోంది. “ఎవరైనా బందీని కిడ్నాప్ చేసి గాజాకు తీసుకువస్తే 10,000 అమెరికా డాలర్ల స్టైఫండ్, ఒక అపార్ట్‌మెంట్” ఇస్తామని హామీ ఇచ్చిన్నట్లు అని హమాస్ ఉగ్రవాది వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.
వృద్ధ మహిళలు, పిల్లలను అపహరించాలని తమకు ప్రత్యేకంగా సూచించినట్లు కూడా వారు చెబుతున్నారు. “ఇళ్ళను పగల గొట్టండి, వీలైనంత ఎక్కువ మంది ఖైదీలను కిడ్నాప్ చేయండి” అని కూడా తమను కోరినట్లు ఒక ఉగ్రవాది చెప్పాడు. “ఆమె (బాధితురాలు) కుక్క బయటకు వచ్చింది. నేను కాల్చివేసాను” అని ఆ ఉగ్రవాది వీడియోలో స్పష్టంగా చెప్పాడు.
“ఆమె శరీరం నేలపై పడి ఉంది. నేను ఆమెను కూడా కాల్చాను. నేను శవం మీద బుల్లెట్లు వృద్ధ చేస్తున్నాను అంటూ కమాండర్ నాపై అరిచాడు” అంటూ చెప్పుకొచ్చాడు. మరో హమాస్ ఉగ్రవాది మాట్లాడుతూ, తమ హ్యాండ్లర్ చెప్పిన పని చేసిన తర్వాత, రెండు ఇళ్లను తగులబెట్మని చెప్పాడు. “మేము వచ్చిన పనిని పూర్తి చేసిన తర్వాత రెండు ఇళ్ళు తగలబెట్టాము” అని అతను చెప్పాడు.
అక్టోబరు 7 హత్యలపై కొనసాగుతున్న దర్యాప్తులో, అనేక “ఇతివృత్తాలు” (నేరాల స్వభావం) పదే పదే వచ్చినట్లు ఐఎస్ఎ ప్రకటనలో తెలిపింది. వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా పౌరులను చంపడానికి, అపహరించడానికి హమాస్ నుండి అందుకున్న స్పష్టమైన సూచనలను ఉద్దేశపూర్వకంగా అంగీకరిస్తూనే, ఉగ్రవాదులు, వీడియో క్లిప్‌లో, దక్షిణ ఇజ్రాయెల్‌లో ఆ నాటి మారణకాండకు సంబంధించిన పలు వివరాలను కూడా పంచుకున్నారు.
ఇంతలో, హమాస్ సైనిక విభాగం సీనియర్ కమాండర్లు (కంపెనీ కమాండర్ ర్యాంక్, అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నవారు) తమ ముష్కరులను ఇజ్రాయెల్‌లో పోరాడటానికి, చనిపోవడానికి లేదా అరెస్టు చేయడానికి పంపేటప్పుడు సురక్షిత గృహాలలో దాక్కున్నట్టు ఐఎస్ఎ తెలిపింది. మారణకాండలో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ భద్రతా దళాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.
“ఇజ్రాయెల్ దేశ భద్రతా దళాలు 7/10న ఊచకోతలో పాల్గొన్న ఉగ్రవాదులందరి పని పడతాయి” అని స్పష్టం చేశారు. అపూర్వమైన, సమన్వయ దాడులను ప్రారంభించి, సుమారు 2,500 మంది హమాస్ ఉగ్రవాదులు భూమి, వాయు, సముద్రం ద్వారా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి, దక్షిణ ఇజ్రాయెల్‌లోని పౌరులపై అమానుషమైన హింసకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 1,400 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు