ఉగ్రవాది మసూద్‌ అజార్‌ సన్నితుడు దావూద్‌ మాలిక్‌ హతం

మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, జైష్‌ ఏ మహ్మద్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌కు అత్యంత సన్నిహితుడు, లష్కర్‌ ఏ జబ్బార్‌ వ్యవస్థాపకుడు దావూద్‌ మాలిక్‌ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌ దావూద్‌ మాలిక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. 
ముసుగులు ధరించిన వ్యక్తులు అతనిపై కాల్పులు జరుపడంతో ప్రాణాలు కోల్పోయాడు. దావూద్‌ మాలిక్‌ ఓ ప్రైవేట్‌ క్లినికల్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారని తెలస్తున్నది. ఇదిలా ఉండగా, కొంతకాలంగా భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల జాబితాలో వారు ఇటీవల పాక్‌లో హత్యకు గురవుతున్నారు.
 
ఇప్పటికే పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌తో పాటు ఐఎస్‌ఐ ఏజెంట్‌ ముల్లా బహూర్‌ అలియాస్‌ హోర్ముజ్‌పై కాల్పులు మృతి చెందారు. తాజా లతీఫ్‌కు అత్యంత సన్నిహితుడైన దావూద్‌ మాలిక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దావూద్ మాలిక్‌కు లష్కరే జాంగ్వీలతో సంబంధాలున్నాయి. 
మసూద్ అజార్, హఫీజ్ సయీద్, లఖ్వీ, దావూద్ ఇబ్రహీంతో పలువురిని భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. పుల్వామా దాడి తర్వాత బాలాకోట్‌పై భారత సైన్యం వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దావూద్‌ మాలిక్‌ అక్కడే ఉన్నాడు. దాడి నుంచి తప్పించుకున్నట్లు తర్వాత తేలింది. ఈ ఉగ్రవాదులకు పాక్‌ ఐఎస్‌ఐ రక్షణ కల్పిస్తున్నట్లుగా విమర్శలున్నాయి.
స్వ‌దేశానికి మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌
మరోవంక, పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ (73) మ‌ళ్లీ స్వ‌దేశానికి చేరుకున్నారు.  నాలుగేళ్లపాటు బ్రిటన్‌లో తనకు తానుగా విధించుకున్న అజ్ఞాత జీవితాన్ని గడిపిన నవాజ్ షరీఫ్ తన కుటుంభ సభ్యులతో కలిసి ఒక ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు తిరిగివచ్చారు.  వచ్చే జనవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీకి విజయాన్ని చేకూర్చేందుకు ఆయన స్వదేశానికి తిరిగివచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 
మూడు సార్లు పాకిస్థాన్ ప్ర‌ధానిగా చేసిన న‌వాజ్ ష‌రీఫ్‌ ను ఓ అవినీతి కేసులో కోర్టు దోషిగా తేలుస్తూ రాజ‌కీయాల నుంచి జీవిత‌కాలం వేటు వేసిన విష‌యం తెలిసిందే.  కాగా, ఈ మంగ‌ళ‌వారం వ‌ర‌కే ఓ కేసులో ష‌రీఫ్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అవినీతి కేసులో ఏడేళ్ల శిక్ష ప‌డ‌గా, ఆయ‌న ఒక సంవ‌త్స‌రం క‌న్నా త‌క్కువ స‌మ‌యమే జైలులో ఉన్నారు. వైద్య చికిత్స కోసం తొలుత లండ‌న్ వెళ్లారు. 
 
ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం ఎన్ని ఆదేశాలిచ్చినా ష‌రీఫ్ మాత్రం తిరిగి రాలేదు. ప్ర‌స్తుతం ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండ‌డంతో తిరిగి న‌వాజ్ ష‌రీఫ్ స్వ‌దేశానికి చేరుకోవడం గమనార్హం.