ఆటంకాలు అధిగమించి గగన్‌యాన్ ప్రయోగం విజయవంతం

 
సాంకేతిక కారణాలతో చివరి క్షణాలలో అకస్మాత్తుగా ఆగిపోయిన్నట్లు ప్రకటించిన గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన తొలిదశ ప్రయోగం టీవీ-డీ1 (టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌-1)ను, తిరిగి కొట్టి సేపటికే లోపాలను సరిచేసి విజయవంతంగా ప్రయోగించారు. కేవలం గంట వ్యవధిలోనే  సాంకేతిక లోపం ఎక్కడనే విషయాన్ని గుర్తించి శాస్త్రవేత్తలు సరి చేశారు. 
 
సరిగ్గా  ఉదయం10 గంటలకు రాకెట్ ప్రయోగించగా నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మరో నాలుగైదు గంటల తరువాత క్రూమాడ్యూల్ భూమికి చేరుకోనున్నది. కాగా.. ప్రయోగానికి సర్వం సిద్ధమై.. ఇక ప్రయోగించడమే తరువాయి అన్నప్పుడు చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు హోల్డ్‌ చేశారు.
కేవలం ఐదు సెకన్లలో నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా కొద్దిపాటి మంటలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన శాస్త్రవేత్తలు ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయోగాన్ని నిలిపివేశారు. దానితో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్​యాన్​ తొలి అడుగుకు బ్రేక్​ పడింది! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ఉదయం చేపట్టాల్సిన టీవీ-డీ1 ఫ్లైట్​ టెస్ట్ (టెస్ట్​ వెహికిల్​ డెవలప్​మెంట్​ ఫ్లైట్​ మిషన్​) వాయిదా పడింది. 
 
టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 రాకెట్‌లో సాంకేతిక లోపం తలేత్తడంతో కౌంట్ డౌన్ కు నాలుగు సెకండ్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తామని, అన్ని సరిచూసుకుని మరోసారి పరీక్ష చేపడతామని ఆయన తెలిపారు. ఆ తర్వాత ప్రయోగ తేదీని ప్రకటిస్తామని సోమనాథ్ పేర్కొన్నారు. కానీ, 10 గంటలకు తిరిగి ప్రయోగించారు.
రాకెట్ 17 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ‘అబార్ట్’ సంకేతం పంపారు. దీంతో రాకెట్ లోని క్రూ ఎస్కేప్ వ్యవస్థ యాక్టివేట్ అయింది. రాకెట్ నుంచి విడివడి పారాచూట్ సాయంతో సముద్రంలో ల్యాండ్ అయింది. ప్రయోగం ఆద్యంతం అనుకున్నట్లుగానే కొనసాగిందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ వివరించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ అభినందనలు తెలిపారు.
 
టీవీ-డీ1 క్రూ మాడ్యూల్ అనుకున్న‌ట్లే నింగిలోకి దూసుకెళ్లి.. ఆ త‌ర్వాత బంగాళాఖాతంలో సుర‌క్షితంగా దిగింది. పారాచూట్ల ఆధారంగా మాడ్యూల్ నీటిపై వాలింది. మూడు పారాచూట్ల సాయంతో క్రూ మాడ్యూల్ దిగింది. సముద్రంలో ఉన్న ఇండియ‌న్ నేవీ ఆ మాడ్యూల్‌ను సేక‌రించ‌నున్న‌ది.

వాస్తవానికి శనివారం ఉదయం 8 గంటలకు ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి శుక్రవారమే కౌంట్​డౌన్​ మొదలైంది. కాగా చివరి నిమిషంలో 8:30 గంటలకు వాయిదా పడింది. అక్కడి నుంచి 8:45 గంటలకు వెళ్లింది. అంతా సరిగ్గా జరుగుతోందన్న సమయంలో రాకెట్​ లాంచ్​ ‘హోల్డ్​’లోకి వెళ్లిపోయింది. ఫలితంగా ఈ రోజు చేపట్టాల్సిన ప్రయోగం సాధ్యం అవ్వలేదు.

ఇస్రో ఇప్పటివరకు మనుషులను అంతరిక్షంలోకి పంపించలేదు. గగన్​యాన్​తో ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తిచేయాలని భావిస్తోంది. ముగ్గురు సభ్యుల బృందాన్ని 400 కి.మీల దూరంలోని భూమి కక్ష దగ్గరకు పంపించి, మూడు రోజుల తర్వాత వారిని బంగాళాఖాతంలో సేఫ్​గా ల్యాండ్​ చేయాలని ఇస్రో ప్లాన్​ చేస్తోంది. 

ఇది విజయవంతమయతే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్​ నిలుస్తుంది. అయితే, ఇది అంత సులభమైన విషయం కాదు. మానవ సహిత మిషన్​లు చేపట్టే ముందు  మానవ రహిత ప్రయోగనాలు విజయవంతం కావాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే శనివారం టీవీ-డీ1 ఫ్లైట్​ టెస్ట్​ చేపట్టాలని నిర్ణయించింది ఇస్రో. ఇందులో కీలకమైన ‘క్రూ ఎస్కేప్​ సిస్టెమ్​’ని పరీక్షించాల్సి ఉంది.

ఈ ప్రయోగం చాలా కీలకం. అనుకోని సమస్య ఏదైనా ఎదురైతే రాకెట్​లో నుంచి వ్యోమగాముల బృందం సురక్షితంగా బయటపడగలదా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. దీనిని ‘అబార్ట్​’ మిషన్​ అని కూడా పిలుస్తోంది ఇస్రో.  మొత్తం రెండు అబార్ట్​ మిషన్​లు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్బిట్​ నుంచి తిరిగి వస్తున్నప్పుడు బంగాళాఖాతంలో సేఫ్​ ల్యాండింగ్​ చేయగలమా? అన్నది నిర్ణయించడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇవి విజయవంతం అవ్వడం గగన్​యాన్​ మిషన్​కు చాలా అవసరం.