హీరో నవదీప్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇటీవలే ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు బుధవారం విచారించింది.
నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు తమ పిటిషన్ లో కోరారు. ఈ కేసులోని నిందితులతో నవదీప్ కు సంబంధాలు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి నవదీప్ ను విచారించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నవదీప్ అరెస్ట్ తప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది.
దానితో, హైకోర్టు ఆదేశాలతో నవదీప్ కు 41ఏ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. నవదీప్‌తో పాటు పలువురికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. నైజీరియన్లు నుంచి సినీ నటుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇప్పటికే ప్రకటించారు. అప్పటి నుంచి సినీ నిర్మాత ఉప్పల రవీ, సినీ నటుడు నవదీప్ పరారీలో ఉన్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఇంట్లో మంగళవారం తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నవదీప్‌ను 37వ నిందితుడిగా ప్రకటించారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన నిందితుడు రాంచంద్ నుంచి హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కొటిక్స్ బ్యూరో చెబుతోంది. నవదీప్ ఇంట్లో సోదాలు జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేనట్టు తెలుసింది.
మరోవైపు డ్రగ్స్‌కేసులో తనకు సంబంధం లేదంటూ తెలంగాణ హైకోర్టును నవదీప్ గత వారం ఆశ్రయించారు. దీంతో నవదీప్‌ను మంగళవారం 19వ తేదీ వరకు వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారు జామున నార్కోటిక్స్ బ్యూరో నవదీప్ నివాసంలో సోదాలు నిర్వహించింది.
హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో ఫైనాన్షియర్లు పట్టుబడ్డారు. ఆగష్టు 31న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో భగ్నం చేసింది. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
హైటెక్ సిటీ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 804లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందడంతో అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు నైజీరియన్లు సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
మోహన్ బాబు కుటుంభంలో ఆస్తుల విషయమై ఘర్షణ?