
తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆమె హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నారా? అంటూ తెలంగాణలో ఆర్టీసీని ఏ స్థాయికి తీసుకు వచ్చారో కర్ణాటక లో ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని ఆమె విమర్శించారు. కర్ణాటక లో ఆర్టీసీ ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎంత దూరమైన ఉచిత ప్రయాణమని చెప్పి ఇప్పుడు 30 కి.మీ అంటూ కుదించారని అరుణ గుర్తు చేశారు.
ముందుగా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు మూడు గ్యారెంటీలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 1. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారరని, 2. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్కాములుండవని, 3. తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టియ్యమని గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతే వారు మాట్లాడాలని ఆమె స్పష్టం చేశారు.
గ్రామాలు, రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, అయితే, తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం అణచివేసిందని, ప్రజలను మోసం చేసిందని ఆమె ధ్వజమెత్తారు. పార్లమెంటులో నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే కవిత తన లేఖతోనే బిల్లు పెట్టారని, తమ చొరవేనంటూ నాటకాలు ఆడుతోందని అంటూ అరుణ ఎద్దేవా చేశారు.
కవిత! తెలంగాణలో మహిళలకు సరైన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వమని మొదలు మీ నాన్న కేసీఆర్ కి చెప్పు అంటూ బిజెపి నేత హితవు చెప్పారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలకు కానీసం 15 శాతం కూడా రిజర్వేషన్ అమలు చేయలేదే? అంటూ ప్రశ్నించారు. పార్టీ లో ఒక్క మహిళ కు అయినా అత్యున్నత పదవి ఇచ్చారా? అని నిలదీశారు.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!
15 నెలల్లో తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. రూ. 1.52 లక్షల కోట్లు