ఆలయ కమిటీలలో నేరచరిత్ర వారొద్దు

ఆలయ కమిటీల నియామకాలలో ఆర్థిక కుంభకోణాలలో ఉన్నవారిని, నేరచరిత్ర ఉన్నవారిని, అవినీతి ఆరోపణలు ఉన్నవారిని సభ్యులుగా వేయరాదని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. కేవలం దైవంపట్ల భక్తి, సమాజం పట్ల శ్రద్ధ ఉన్నవారిని మాత్రమే నియమించాలని పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి  మిలింద్ పరాండేజీ డిమాండ్ చేశారు.
 
హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని, దేవాలయాల నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా హిందువులకే అప్పగించాలని ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కోరారు. ఇప్పటివరకు దేవాలయాల ఆస్తులు, ఆదాయాలు కేవలం హిందువుల కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి ఆయన స్పష్టం చేశారు.
 
దేవాలయ ఉద్యోగాలు, షాపులు హిందువులకు మాత్రమే కేటాయించాలని ఆయన కోరారు. టిటిడి భక్తుల సురక్ష విషయంలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని చెబుతూ  భక్తుల దర్శనాలకు ఆటంకం గానీ , నిరోధించే నిర్ణయాలు గానీ తీసుకోకుండా భక్తుల సురక్ష విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.
 
ఆంధ్ర ప్రదేశ్ లో మత మార్పిడులు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయని పేర్కొంటూ  వీటిని అరికట్టడం కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మతమార్పిడుల నిర్రోధక బిల్లు తీసుకు రావాలని పరాండేజీ డిమాండ్ చేశారు. కాగా, తమిళనాడు మంత్రి, ఆ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మా న్ని కించపరుస్తూ చేసిన వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
 
వేగంగా అయోధ్య ఆలయ నిర్మాణం

అయోధ్య ఆలయ నిర్మా ణము వేగంగా జరుగుతున్నదని, 2024 సంక్రాంతి తరువాత జనవరి16 నుండి 24 మధ్యలో ఆలయ విగహ్ర మూల విరాట్టుల ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని  పరాండేజీ తెలిపారు.  దేశవ్యా ప్తంగానేకాకుండా పప్రంచంలోని హిందువులంతా గర్వించేవిధంగా ఈ  కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
 
విశ్వహిందూ పరిషత్ దేశవ్యా ప్తంగా బజరంగదళ్ శౌర్య జాగరణ యాత్ర జరుపుతున్నట్లు వెల్లడించారు. యువకులలో దేశభక్తి, దైవభక్తి పెంచడం, యువత వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రేణ కలిగించడం, స్వతంత్ర సంగ్రామ మూర్తుల త్యా గాలను స్మరించుకుంటూ వారి శౌర్యా న్ని యువకులు అలవర్చు కునేలా ఈ యాత్ర నిర్వహిస్తామని వివరించారు.  ఆంధప్రద్రేశ్ లో 80% గ్రామాలకు ఈ యాత్రవెళ్లేలా యోజన చేసిన్నట్లు చెప్పారు.
 
పరిషత్ ను స్థాపించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా షష్ట్యాబ్ది ఉత్సవాలను దేశవ్యా ప్తంగా సంస్థాగత విస్తరణ లక్ష్యంగా ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. పస్ర్తుతం దేశంలో ఉన్న 76వేల కమిటీలను లక్ష కమిటీలు చేయడం, 72 లక్షల ఉన్న సభ్యులను ఒక
కోటి చేయడం, దేశవ్యాప్తంగా ఉన్న 4500 సేవా  సంఖ్యను మరింత పెంచడం, దేశంలో ఉన్న 400 సేవాయుక్తజిల్లాల సంఖ్యను రెట్టింపు చేయడం జరుగుతోందని వివరించారు. 
 
ఆంధప్రద్రేశ్ లో 40 సంవత్సరాల నుండి 27 సేవా కార్యా లు ఎస్సి, ఎస్టీ  ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని,  పాఠశాలల్లో 950 మందివిద్యా ర్థులు వసతి గృహంలో 520 మంది విద్యా ర్థులకు అందిస్తున్నట్లు తెలిపారు.  దేశవ్యా ప్తంగా ధర్మా చార్య యాతల్రు దీపావళి ముందు నిర్వహించి హిందూ జాగరణ, సమరసభావన సాధన, కుటుంబ ప్రబోధన,  మతమార్పిడులు పట్ల జాగరణను హిందూ సమాజానికి ధర్మా చార్యు లు ఈ యాతల్ర ద్వా రా అందిస్తారని వివరించారు.
పరిషత్ కేంద్రీయ సదస్యులు వై రాఘవులు, ప్రాంత అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు, కార్యదర్శి టి ఎస్ రవి కుమార్ కూడా పాల్గొన్నారు.