క్రిప్టో కరెన్సీలపై సమగ్ర, ఏకీకృత వైఖరి

క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సమస్యల పరిష్కరించుకోవడానికి సమగ్ర, ఏకీకృత వైఖరి అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వినియోగదారులు, వ్యాపార సంస్థల మధ్య నమ్మకం బలంగా ఉండాలని చెబుతూ వినియోగదారుల హక్కుల పట్ల సంబరపడేదానికన్నా వినియోగదారుల సంరక్షణ పట్ల దృష్టి సారించాలని వ్యాపారవేత్తలకు సూచించారు.

ఢిల్లీలో జరుగుతున్న బి20 బిజినెస్ సదస్సునుద్దేశించి ఆయన ఆదివారం మాట్లాడుతూ `వినియోగదారుల పరిరక్షణ గురించి మనం మాట్లాడగలమా? అది సకారాత్మక సంకేతాలను పంపిస్తుంది. వినియోగదారుల హక్కుల సమస్యలను పరిష్కరిస్తుంది.మనం వ్యాపారస్థులువినియోగదారుల మధ్య నమ్మకాన్ని పెంపొందించాలి’ అని చెప్పారు. 

అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఏదో ఒక రోజున జరుపుకోవాలని సూచించారు. ఉత్పత్తిదారులు, వినియోగదారులప్రయోజనాల మధ్య సమతుల్యత ఉన్నప్పుడే లాభదాయక మార్కెట్ సుస్థిరమవుతుందని చెబుతూ ఇతర దేశాలను కేవలం మార్కెట్లుగా పరిగణించడం వల్ల ప్రయోజనముండదని, అలా చూడడంవల్ల ఉత్పత్తిదారులైన దేశాలకు నేడో , రేపో హాని జరుగుతుందని హెచ్చరించారు.

అభివృద్ధిలో అందరినీ సమభాగస్వాములు చేయడం మన ముందున్న మార్గమని ప్రధాని సూచించారు. మరింత ఎక్కువగా వినియోగదారుల కేంద్రంగా వ్యాపారం జరిగే విధంగా వ్యాపారాన్ని తీర్చిదిద్దడం ఎలాగో మనం చెప్పగలమా? అని ప్రశ్నించారు. ‘మీరు (వ్యాపారులు) ప్రజలంతా పండగ ఉత్సాహంతో ఉన్నప్పుడు భారతదేశానికి వచ్చారు. ఈ సారి భారత దేశంలో పండగల సీజన్ ఆగస్టు 23న ప్రారంభమైంది. చంద్రుని ఉపరితలంపైకి చంద్రయాన్3 దిగినందుకు ఈ సంబరాలు జరుగుతున్నాయి’ అని మోదీ తెలిపారు. 

భారత దేశ లూనార్ మిషన్ విజయవంతమవడంలో ఇస్రో ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొంటూ అంతేకాకుండా భారత దేశంలో ని పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఇలు, ప్రైవేటు కంపెనీలు కూడా ఈ విజయంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయిని ప్రధాని స్పష్టం చేశారు. ఇది సైన్స్, పారిశ్రామిక రంగం సాధించిన విజయం’ అని ప్రధాని అభివర్ణించారు. 

భారత దేశానికి సమ్మిళితత్వ విజన్ ఉందని, అందుకే జి20 సవదస్సుకు ఆఫ్రికా దేశాలను ఆహ్వానించామని గుర్తు చేశారు. భారతదేశంలో ప్రతిభావంతులైన యువత అత్యధికంగా ఉందని చెబుతూ ఇండస్ట్రీ 4.0సమయంలో డిజిటల్ విప్లవానికి దేశం నాయకత్వం వహిస్తోందని ప్రధాని తెలిపారు. సామర్థాన్ని సౌభాగ్యంగా, అడ్డంకులను అవకాశాలుగా, ఆకాంక్షలను విజయాలుగా మార్చే సత్తా వ్యాపార రంగానికి ఉందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. వ్యాపారం చిన్నదయినా, పెద్దదయినా, స్థానికంగా లేదా అంతర్జాతీయ స్థాయిలో జరిగేదైనా ప్రతి ఒక్కరినీ అభివద్ధి చేస్తుందని చెప్పారు. 

సమర్థవంతమైన ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో భారత దేశ పాత్ర గురించి మాట్లాడుతూ, గ్లోబల్ సప్లై చైన్‌ను ప్రపంచం ఒకే విధంగా చూడడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు అంతరాయాలు ఏర్పడే సరఫరా వ్యవస్థను సమగ్రమైన వ్యవస్థగా పిలవగలమా? అని ప్రశ్నించారు.

ఈ సమస్యకు పరిష్కారం భారత దేశమేనని చెప్పారు. భారత దేశంలో హరిత ఇంధనంపై దృష్టిసారించామని మోదీ పేర్కొన్నారు. సౌర విద్యుత్, ఇంధణ రంగాల్లో సాధించిన విజయాలను గీక్రన్ హైడ్రోజన్ రంగంలో కూడా పునరావృతం చేయాలని లక్షంగా పెట్టుకున్నామని తెలిపారు. అన్ని దేశాలను కలుపుకొని పోవాలని భారత దేశం కోరుకుంటోందని , అంతర్జాతీయ సౌర కుటుంబం రూపంలో అది ప్రతిఫలిస్తోంది చెప్పారు.