
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా, ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలం కావడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆమె బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే బీజేపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు మెదక్, రంగారెడ్డి డీసీసీబీ మాజీ ఛైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు కూడా బీజేపీలో చేరనున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని జయసుధ కలవడంతో ఆమె కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఆమె 2009లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్త్ర 2014 ఎన్నికలలో ఓటమి చెందడంతో రాజకీయంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. 2016లో ఆమె టిడిపిలో చేరినా, 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరినా ఆపార్టీలు ఆమెను పట్టించుకోలేదు.
కొద్ది రోజుల క్రితం బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఆమెను కలిసి బీజేపీలో చేరమని ఆహ్వానించారు. అయితే అప్పట్లో ఆమె ఓ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇప్పుడు బీజేపీలో చేరి, వచ్చే ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
More Stories
ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ!
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం