ప్రమాదకరస్థాయి దాటిన యమునా నదీ ప్రవాహం

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో యుమునా నది ప్రవాహం ఆదివారం మరోసారి ప్రమాదకర స్థాయి (205.81 మీటర్లు)ని దాటింది. దీంతో మరోసారి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఆదివారం సాయంత్రం 6 గంటలకు యమున నీటిమట్టం 206.35 మీటర్లుగా నమోదైంది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హతిుకుండ్‌ బ్యారేజ్‌ నుంచి నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో యమునా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
 
ఢిల్లీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస కార్యక్రమాలపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘హతిుకుండ్‌ బ్యారేజ్‌ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీలోని కొనిు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉను వారినిసురక్షిత ప్రాంతాలకుతరలించాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఢిల్లీ మంత్రి అతిషీ వెల్లడించారు.
 
గతవారం వర్షాల కారణంగా యమునా నది నీటి మట్టం అత్యధికంగా 208.05 మీటర్లకు చేరింది. గత కొద్ది రోజులుగా నీటి మట్టం 205.02 మీటర్లుగా ఉంది. తాజాగా హతిుకుండ్‌ బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆదివారం ఉదయం 206.07 మీటర్లకు చేరుకుంది. మరోవైపు జులై 25 వరకు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనికేంద్ర వాతావరణ అంచనా వేసింది. 
 
హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు తలెత్తాయి. వరదల కారణంగా 27,000 మందికి పైగా ప్రజలు తమ ఇండ్లను ఖాళీ చేసినట్టు అధికారులు తెలిపారు. యమునా నదిలో నీటి విడుదల పెరగడంతో గౌతమ్‌ బుద్ధ నగర్‌ పరిపాలన హిందోన్‌ వెంబడి లోతట్టు ప్రాంతాలకు వరద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
 
మహారాష్ట్రలో కొండచరియలు విరిగి 27 మంది మృతి
 
మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో మృతుల సంఖ్య 27కుచేరింది. రాస్‌గఢ్‌ జిల్లాలో కొండ ప్రాంతమైన ఇర్షల్వాడీలో కొండచరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది. ఈ ఘటనలో 81మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం నాలుగో రోజూ ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఇతర సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
 
నాగ్‌పూర్‌ డివిజన్‌లో వరదలు, మెరుపులతో 10 రోజుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఇండ్లు దెబ్బతినాుయి. నాగ్‌పూర్‌, వార్ధా, భండారా, గోండియా, చంద్రపూర్‌, గడ్చిరోలి జిల్లాలతో కూడిన నాగ్‌పూర్‌ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలలో 875.84 హెక్టార్ల వ్యవసాయ భూమిని వర్షాలు కూడా ప్రభావితం చేశాయి.
 
ఇదిలా ఉండగా, జూలై 22న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో అనేక చోట్ల భారీ వర్షాలతో చాలా రోడ్లు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.