
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లోగోనుంచి పక్షి మాయమవుతుందని దాని యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించాయిరు. కొన్నేళుల్గా ట్విట్టర్‌కు ఆ పక్షి లోగా ప్రధాన చిహ్నంగా ఉన్న విషయం తెలిసిందే. లోగో మార్పు విషయాన్ని మస్క్ ఆదివారం ట్విట్టర్లో వెల్లడించారు.
ట్విట్టర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన‘ ఎక్స్‌కార్ప్’లో విలీనం చేయనున్నట్లు కొన్నాళ్ల క్రితం మస్క్ ప్రకటించారు. “త్వరలోనే మేము ట్విట్టర్ బ్రాండ్‌కు.. ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన ‘x’ లోగో బాగుంటే రేపటినుంచే అది అమలులోకి వస్తుంది’అని మస్క్ ట్వీట్ చేశారు.
మస్క్ ట్విట్టర్‌ను గత ఏడాది కొనుగోలు చేసిన తర్వాత అతిపెద్ద మార్పు ఇదేనని చెప్పవచ్చు. మస్క్‌కు ‘x’ అక్షరం చాలా ఇష్టం.ఈ విషయం కొత్తేమీ కాదు.ట్విట్టర్ సిఇఓగా లిండా యాకరీనో బాధ్యతలు స్వీకరించిన సమయంలో కూడాకంపెనీని ఎవ్రీథింగ్ యాప్ ఎక్స్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని మస్క్‌ట్వీట్ చేశారు.
ఇక ట్విట్టర్‌లోని అన్‌వెరిఫైడ్ ఖాతాలనుంచిప్రత్యక్ష సందేశాలు ఉంచడాన్ని పరిమితం చేస్తున్నటట్లు మస్క్ శనివారం ప్రకటించారు. ‘డైరెక్ట్ మెస్సేజిల స్పామ్‌ను తగ్గించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ వెరిఫైడ్ భవిష్యతుత్తులోపరిమిత సంఖ్యలోనే డిఎంలు( డైరెక్ట్ మెస్సేజిలు) చేయగలరు. నేడే సబ్‌స్ర్కైబ్ చేసుకొని ఎక్కువ మెస్సేజిలు పంపండి’ అని ట్విట్టర్ పేర్కొంది.
ఎక్స్ హోల్డింగ్స్ కార్పొరేషన్ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రం లో మస్క్ ఓ కొత్త కంపెనీని స్థాపించారు. ‘ఎక్స్’ అనే దాన్ని కొన్నాళ్లుగా ఆయన ‘ఎవ్రిథింగ్ యాప్’గా వ్యవహరిస్తున్నారు. ఇక ట్విటర్ లోగో మార్పునకు సంబంధించిన ట్వీట్ చేసిన గంట తర్వాత ట్విటర్ ప్లాట్‌ఫామ్ రంగును నీలం నుంచి బ్లాక్‌కు (నలుపు)మార్చే ఆలోచనలో ఉన్నట్టు మస్క్ మరో ట్వీట్ చేశారు.
దీనికి సంబంధించి ఆయన నిర్వహించిన పోల్‌కు గంట వ్యవధిలో 2.24 లక్షల మంది స్పందించారు. వారిలో 76.3శాతం మంది రంగు మార్పుపై సానుకూలంగా స్పం దించారు. ఇక ట్విటర్‌కు పోటీగా ఫేస్బుక్ మాతృసంస్థ మెటా అభివృద్ధి చేసిన త్రెడ్స్ (దీని లోగో దారం) జోరు తగ్గింది. ఆ యాప్‌ను తెచ్చిన కొద్దిరోజుల్లోనే కోటిమందికిపైగా డౌన్లోడ్ చేసుకోవడంతో ట్విటర్‌కు అది గట్టి పోటీ ఇస్తుందనుకున్నారు.
‘ట్విటర్ కిల్లర్’ అని దానికి పేరు కూడా పెట్టేశారు. కానీ.. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నవారి ఇన్స్టాగ్రామ్ ఖాతాతో దాన్ని అనుసంధానం చేయడంతో.. త్రెడ్స్‌ను డిలీట్ చేస్తే ఇన్‌స్టా ఖాతా కూడా డిలీట్ అయిపోతోంది. ట్విటర్ వినియోగదారులు అనామకంగా తమ ఖాతాను వాడుకునే వీలుంది. ఈ నేపథ్యంలో.. త్రెడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసేవారి సంఖ్య భారీ గా తగ్గిపోయింది.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఐఎస్ఐఎస్ చీఫ్ ను హతమార్చిన అమెరికా దళాలు
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!