నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3

చంద్రయాన్ 3 తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. లాంచ్ వెహికిల్ మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ 3 ని విజయవంతంగా నిర్ధారిత కక్షలో ప్రవేశపెట్టింది. చంద్రయాన్ 3 తొలి దశ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 3 ప్రయోగం తొలి దశ విజయవంతంగా ముగిసిందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. ‘కంగ్రాచ్యులేషన్స్ ఇండియా’ అంటూ ఆయన ఈ విజయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ మిషన్ లో పాల్గొన్న అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్‌ ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది.  ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్‌కు తరలి వచ్చారు.

చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో ఉన్నాయి.

ఇస్రో విజయాశ్వంగా పిలువబడే పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోని పీఎస్‌ఎల్‌వీ -సీ53 నింగిలోకి ఎగిరింది. బుధవార సాయంత్రం 4 గంటలకు షార్‌లో ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. 26 గంటల పాటు నిర్విరామంగా ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కొనసాగింది. కౌంట్‌డౌన్‌ సమయంలోనే నాలుగు దశల రాకెట్లలో 4, 2 దశల మోటార్లలో ద్రవ ఇంధనాన్ని నింపారు. 
 
అనంతరం 1, 3 దశల మోటార్లకు ఘన ఇంధనాన్ని శాస్త్రవేత్తలు నింపారు. ప్రయోగానికి సుమారు 30 నిమిషాల ముందు రాకెట్‌ను సూపర్‌ కంప్యూటర్‌ ఆధీనంలోకి తీసుకెళ్లారు శాస్త్రవేత్తలు.  సూపర్‌ కంప్యూటర్‌ ఆదేశాలతో కౌంట్‌డౌన్‌ 0కు చేరుకోగానే నిప్పులు చిమ్ముతూ… పీఎస్‌ఎల్‌వీ -సీ53 నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్ లో ఇది 55వ ప్రయోగం. సింగపూర్ శాటిలైట్స్ ను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది.

ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు మోదీ  గుడ్ ల‌క్ సందేశం

దీనిపై ప్రధాని మోదీమో ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు గుడ్ లక్‌ సందేశం పంపారు.  ‘అంతరిక్ష రంగంలో జులై 14,2023 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. చంద్రుడిపైకి చంద్రయాన్‌-3 ప్రయాణం మెదలవుతుంది. ఈ మిషన్ కోట్లాది మంది భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్తుంది’ అని మోదీ  ట్వీట్ చేశారు.  భవిష్యత్తులో జాబిల్లి జనావాసంగా మారొచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. 
‘చంద్రయాన్‌-1 ప్రయోగం ముందువరకు చందమామపై ఒక్క చుక్క కూడా నీరు ఉండదని అభిప్రాయపడేవారు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది. ఇక ఇది భవిష్యత్తులో జనావాసంగా మారొచ్చు’అని ఆకాక్షించారు.  తాజా ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని ప్రధాని కొనియాడారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ప్రస్తుత ప్రయోగంపై దృష్టి సారించారు.
 
ఈ రాకెట్‌ చంద్రయాన్‌-3ని భూమి చుట్టూ ఉన్న 170X36,500 కి.మీ దీర్ఘవృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. ఇది 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతూ.. చంద్రుడి దిశగా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్‌-3ని పంపిస్తారు.