పలు రకాల బియ్యం ఎగుమతులాలపై నిషేధం

hemp sacks containing rice

దేశీయంగా ధరలను అదుపులో ఉంచడంతో పాటు, ఎల్‌నినో ప్రభావం కూడా ఉంటుందని వార్తలు వస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం పలు రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. బాస్మతి బియ్యం మినహా అన్ని రకాల బియ్యం ఎగుమతులను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోంని సంబంధ వర్గాలు వెల్లడించాయి. 

దేశీయంగా మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీసుందని, దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే 80 శాతం బియ్యం ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల దేశీయంగా బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది.

 అయితే మన దేశం నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోతే చాలా దేశాల్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. మొత్తం గ్లోబల్‌ సప్లయ్‌లో ఆసియా దేశాలే 90 శాతం బియ్యాన్ని వినియోగిస్తున్నాయి. ఇప్పికే చాలా మార్కెట్లలో బియ్యం ధరలు రెండేళ్ళ గరిష్టానికి చేరుకున్నాయి.

ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో మన దేశం వాటా 2022-23 సంవత్సరంలో 40.5 శాతంగా ఉంది. వియత్నాం వాటా 13.5 శాతం, థాయిలాండ్‌ 15.3 శాతం, ఇతర దేశాలు 30.7 శాతం వాటా కలిగి ఉన్నాయి. గత సంవత్సరం ఉక్రెయిన్‌ పై రష్యా దాడి చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బియ్యం, గోధుమలు, మొక్కజొన్న రేట్లు భారీగా పెరిగాయి. 

మన దేశం బియ్యంతో పాటు గోధుమల ఎగుమతులను కూడా పరిమితం చేసింది. మన దేశం నుంచి 100 దేశాలకు బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం పై ప్రపంచ వాతావారణ సంస్థ చాలా ముందుగానే హెచ్చరించడంతో చైనా, ఫిల్పిపైన్స్‌, ఇండోనేషియా వంటి దేశాలు భారీగా బియ్యం నిల్వలను పెంచుకున్నాయి. 

జూన్‌లో ఆహార ధరలు పెరగడంతో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ మధ్య కాలంలో మన దేశంలో బియ్యం ధరలు 8-15 శాతం వరకు పెరిగాయని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది.