ఎనిమిదేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

జూన్ నెలలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్లుపిఐ) మైనస్ -4.12 శాతానికి తగ్గింది. డబ్ల్యుపిఐ వరుసగా మూడో నెల క్షీణతను నమోదు చేసింది. 8 సంవత్సరాలలో ఇదే కనిష్ట స్థాయి టోకు ద్రవ్యోల్బణం కావడం గమనార్హం. అంతకుముందు అక్టోబర్ 2015లో ఇది -మైనస్ 3.81 శాతంగా ఉంది. మే నెలలో ఇది మైనస్ -3.48 శాతం వద్ద ఉంది. 

గత సంవత్సరం జూన్ 2022లో టోకు ద్రవ్యోల్బణం 15.18 శాతం వద్ద ఉంది. జూన్‌లో డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధానంగా మినరల్ ఆయిల్స్, ఫుడ్ ఆర్టికల్స్, బేసిక్ మెటల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, దుస్తుల ధరలు తగ్గుముఖం పట్టాయి. 

ఆహార సూచీలో టోకు ద్రవ్యోల్బణం జూన్‌లో ఏడాది ప్రాతిపదికన 1.24 శాతం క్షీణించింది, ఒక నెల క్రితం 1.59 శాతం తగ్గింది. జూన్‌లో ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 2.87 శాతానికి తగ్గింది. ఆహార పదార్థాల కేటగిరీలో, జూన్‌లో కూరగాయల ద్రవ్యోల్బణం 21.98 శాతం తగ్గగా, పప్పులు, పాలు 9.21 శాతం, 8.59 శాతం పెరిగాయి. 

జూన్‌లో ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 12.63 శాతం తగ్గింది. మేలో 2.97 శాతం తగ్గిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్‌లో 2.71 శాతానికి తగ్గింది. అయితే, నెలవారీ ప్రాతిపదికన మే, జూన్‌లలో తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 0.50 శాతం తగ్గింది. 

ఇంధనం, పవర్ కేటగిరీలలో, ఎల్‌పిజి, పెట్రోల్, హెచ్‌ఎస్‌డి ద్రవ్యోల్బణం వరుసగా 22.29 శాతం, 16.32 శాతం, 18.59 శాతానికి తగ్గాయి. జూన్‌లో వార్షిక ప్రాతిపదికన ముడి పెట్రోలియం ద్రవ్యోల్బణం 32.68 శాతానికి తగ్గింది. దాదాపు 8 సంవత్సరాలలో ఇదే కనిష్ట స్థాయి టోకు ద్రవ్యోల్బణం. అంతకుముందు అక్టోబర్ 2015లో భారతదేశ టోకు ద్రవ్యోల్బణం రేటు -3.81 శాతంగా ఉంది.