టిబెట్‌ సమస్యలపై చైనాతో చర్చించేందుకు సిద్ధం

టిబెట్‌ సమస్యలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా వెల్లడించారు. తనను సంప్రదించేందుకు ప్రయత్నించిందని ఆ దేశం ప్రయత్నించిందని తెలిపారు. టిబెట్ ప్రజల ధైర్యాన్ని ఇప్పుడు డ్రాగన్‌ గుర్తించిందన్న ఆయన అందుకే టిబెట్ సమస్యల పరిష్కారానికి చైనా నేతలు తనను సంప్రదిస్తున్నారని చెప్పారు. 
 
ఢిల్లీ- లడఖ్‌కు బయలుదేరే ముందు దలై లామా ధర్మశాలలో పాత్రికేయులతో సంభాషించారు. “టిబెట్ చాలా ఏళ్లుగా చైనా అధీనంలో ఉంది. మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి. టిబెట్‌పై చైనా అణచివేత విధానాలను అవలంబిస్తోంది” అని తెలిపారు.
 
చైనాతో చర్చలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నారా ? అని ప్రశ్నించగా, తాము స్వాతంత్య్రం కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో కొనసాగాలని చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు చైనా మారుతోందని పేర్కొంటూ చైనీయులు అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ తనను  సంప్రదించాలని కోరుకుంటోందని దలైలామా చెప్పారు. 
 
తాను టిబెట్‌లో జన్మించానని, తన పేరు దలైలామా అని, టిబెట్ లక్ష్యం కోసం కృషి చేయడంతోపాటు తాను చైతన్య శీలులందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆశావాదాన్ని వదులుకోకుండా , దృఢ సంకల్పం ఆవిరై పోకుండా తాను చేయగలిగిన దానిని చేశానని చెప్పారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, టిబెట్ పట్ల కఠిన వైఖరిగల చైనా నేతలపై కూడా తనకు కోపం లేదని తెలిపారు.
 
అయితే, ఇప్పుడు చైనా తన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటోందని, చైనా ఇప్పుడు మారుతోందని చెప్పారు. చైనా చారిత్రకంగా బౌద్ధ దేశమని, అక్కడ ఉన్న బౌద్ధ విహారాలు, దేవాలయాలు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.  మఠాలు, దేవాలయాలను కూడా సందర్శించిన వారు తన వద్ద ఉన్నారని తెలిపారు.
“నాకు వస్తున్న స్వప్నాలలో కనిపిస్తున్న సంకేతాలు, ఇతర జోస్యాల ప్రకారం, నేను 100 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు వరకు జీవిస్తాను. ఇప్పటివరకు నేను ఇతరులకు సేవ చేశాను, ఇకపై కూడా దానిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాతిపదికపై నా ఆయురారోగ్యం కోసం ప్రార్థించండి” అని దలైలామా కోరారు. 
దలైలామా 88 వ జన్మదినోత్సవాలు జులై 6న ధర్మశాలలో జరిగాయి. ఆ రోజు ఆయన ఇక్కడి ప్రధాన టిబెటన్ టెంపుల్ ప్రాంగణం లోకి వెళ్లారు. దీనికి సమీపంలోనే ఆయన నివాసం ఉంది. టిబెట్ సంస్కృతి, మతం గురించిన పరిజ్ఞానం ప్రపంచం మొత్తానికి మేలు చేస్తుందని దలైలామా తెలిపారు.  తాను ఇతర మతాలను, వారి సంప్రదాయాలను సైతం గౌరవిస్తానన్న ఆయన.. ప్రేమ, కరుణను వ్యాప్తి చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అనుచరులందరికీ సందేశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.