ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు అడ్మిషన్లు రద్దుచేసుకున్నా, మరో కాలేజీలో చేరినా విద్యార్థులు చెల్లించిన పూర్తి ఫీజును రీఫండ్ చేయాలని ఉన్నత విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది. విద్యాసంస్థ విడుదల చేసిన ప్రాస్పెక్టర్స్, నోటిఫికేషన్‌ల్లో ఏ నిబంధనలున్నా వాటితో సంబంధం లేకుండా సెప్టెంబర్ 30లోపు విద్యార్థులు అడ్మిషన్లు రద్దుచేసుకున్నా, మరో కాలేజీకి మారినా ఫీజు మొత్తాన్ని సంబంధిత విద్యార్థి ఖాతాకు బదలాయించాలని యూజీసీ ఆదేశించింది.
ఇక విద్యార్థి అక్టోబర్ 31లోపు అడ్మిషన్లు రద్దుచేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 1000 మాత్రమే మినహాయించుకోవచ్చు. ఇక అక్టోబర్ 31 తర్వాత అడ్మిషన్ల రద్దు, ఫీజుల వాపస్‌పై యూజీసీ కొన్ని స్లాబులను విధించింది. అడ్మిషన్ల గడువు పూర్తయ్యి 30 రోజుల ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫీజుల వాపసు చేయరు.

More Stories
ఇన్స్టాగ్రామ్లో బాలల లైంగిక వేధింపులపై ఎన్హెచ్ఆర్సి
‘సర్’ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల తొలగింపు
విజయవంతంగా స్వదేశీ ఖగంటక్-243 గ్లైడ్ బాంబు ప్రయోగం