70 శాతం బ్యాంకులకు చేరిన రూ 2,000 నోట్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ గత నెలలో ఉపసంహరించుకున్న రూ 2,000 నోట్లు శనివారం నాటికి 72 శాతం (సుమారు రూ. 2.62 లక్షల కోట్లు) బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి.  మే 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.  అయితే, పౌరులను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ కోరింది.
రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవచ్చని కూడా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.  రోజువారీ అవసరాలకూ వినియోగించుకోవచ్చని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను కొందరు కొనుగోళ్లకు వినియోగిస్తుండగా, మరికొందరు బ్యాంకులకు వచ్చి, వేరే నోట్లలోకి మార్చుకుంటున్న సంగతి తెలిసిందే.
మే 23 నుంచి ఏదైనా బ్రాంచ్‌లో ఒక్క రోజులో ఒకేసారి రూ. 20,000 విలువైన రూ.2000 నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. “కసరత్తును సమయానుకూలంగా పూర్తి చేయడానికి, ప్రజల సభ్యులకు తగిన సమయాన్ని అందించడానికి, అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30, 2023 వరకు రూ. 2,000 నోట్లకు డిపాజిట్ మరియు/లేదా మార్పిడి సౌకర్యాన్ని అందిస్తాయి” అని ఆర్బీఐ తెలిపింది.