మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా

దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా  మూడు బ్యాంకులపై కొరఢా ఝులిపించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ రూల్స్ అతిక్రమణ ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ జాబితాలో దిగ్గజ ప్రైవేటు బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు, బ్యాంకు అఫ్ మహారాష్ట్ర, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్‌ ఉన్నాయి.

యాక్సిస్ బ్యాంకుకు  రూ.30 లక్షల జరిమానా విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇన్‌కమ్ రికగ్నిషన్, అసెట్ క్లాసిఫికేషన్, క్రెడిట్ కార్డు అకౌంట్లు వంటి వాటికి సంబంధించి నిర్దేశించిన రూల్స్‌ను బ్యాంక్ అతిక్రమించినట్లు గుర్తించింది.  అలాగే, థర్డ్ పార్టీ ప్లాట్ ఫామ్స్ ద్వారా కస్టమర్లు డ్యూ డేట్‌లోపు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా కూడా బ్యాంక్ వారి నుంచి ఛార్జీలు వసూలు చేసిందని ఆర్‌బీఐ వెల్లడించింది.

అందుకే జరిమానా విధించినట్లు చెప్పింది. ముందుగానే నోటీసులు జారీ చేయగా బ్యాంకు స్పందన వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై ఏకంగా రూ.1.45 కోట్ల వరకు జరిమానా వేసింది ఆర్‌బీఐ. రుణ మంజూరీలో బ్యాంక్ రూల్స్‌ను అతిక్రమించినట్లు తెలిపింది. ఏటీఎం రూల్స్ కూడా బ్యాంక్ బ్రేక్ చేసిందని పేర్కొంది.

ఏటీఎం టర్మినల్స్, పీసీ, ఏటీఎం స్విచ్ మధ్య ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ నిబంధనలను బ్యాంక్ అధిగమించిందని వివరించింది.  అందుకే జరిమానా వేసినట్లు పేర్కొంది. అలాగే.. జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్‌కి సైతం ఏకంగా రూ.2.5 కోట్లు జరిమానా వేసింది. రుణాల  మంజూరీకి సంబంధించి నిబంధనలను బ్యాంక్ అతిక్రమించిదని ఆర్‌బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ బ్యాంకులపై గట్టి నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థల పని తీరును పరిశీలిస్తోంది. ఆర్థిక ఏడాది చొప్పున తనిఖీలు చేపడుతోంది. ఇలాంటి తనిఖీలు చేసినప్పుడు బ్యాంకులు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ఆయా బ్యాంకులకు భారీగా జరిమానా వేస్తోంది.  2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో బ్యాంకులపై జరిమానా పడింది. 17 నాన్ బ్యాంకింగ్ సంస్థలు, మరో రెండు కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులు సైతం రద్దు చేసింది.