కరోనా సమయంలోనూ వాయుసేన సేవ అద్భుతం

టర్కీ భూకంప సహాయ చర్యలో భారత వాయు సేన బాగా పని చేసిందని ప్రశంసిస్తు కరోనా సమయంలోనూ వాయుసేన అద్భుతంగా పని చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికత అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు.  దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు రివ్యూయింగ్‌ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ   ఫైటర్‌జెట్‌ పైలట్లలో మహిళలు ఎక్కువమంది ఉండటం సంతోషదాయకమని చెప్పారు.  పరేడ్‌కు రివ్యూయింగ్‌ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. క్యాడెట్లకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను క్యాడెట్లు గుర్తించుకోవాలని ఆమె చెప్పారు.
 
” కంబైన్డ్‌ గ్యాడ్యుయేషన్‌ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. క్యాడెట్లకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను క్యాడెట్లు గుర్తుంచుకోవాలి. టర్కీ భూకంప సహాయక చర్యల్లో మన వాయుసేన బాగా పనిచేసింది. కరోనా సమయంలోనూ వాయుసేన అద్భుతంగా పనిచేసింది. సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. సుఖోరు జెట్‌లో ప్రయాణం గొప్ప అనుభూతి ఇచ్చింది ” అని ముర్ము తెలిపారు.
ఏప్రిల్‌లో తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైట‌ర్ జెట్‌లో విహ‌రించిన‌ట్లు ఆమె తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్‌లో బ్ర‌హ్మ‌పుత్రి, తేజ్‌పూర్ లోయ‌ల్లో విహ‌రించాన‌ని, హిమాల‌యాల అద్భుతాల‌ను వీక్షించిన‌ట్లు ఆమె తెలిపారు. స‌ముద్ర మ‌ట్టానికి రెండు కిలోమీట‌ర్ల ఎత్తులో దాదాపు గంట‌కు 800 కిలోమీట‌ర్ల వేగంతో ఎగ‌రడం గొప్ప అనుభూతిని మిగిల్చిన‌ట్లు ముర్ము తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో గవర్నర్‌ డా. తమిళిసై సౌందరాజన్, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్‌,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. మొత్తం 119 ఫ్లైయింగ్‌ ఎయిర్‌ ట్రైనీ, 75 మంది గ్రౌండ్‌ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. వీరితో పాటు ఎనిమిది మంది ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అందులో ఇద్దరు వియత్నాం క్యాడెట్లు, ఆరుగరు నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన క్యాడెట్లు ఉన్నారు.
 
కాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. ఈ సందర్బంగా బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సీఎంతో పాటు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాత్రి ఆమె అక్కడే బస చేశారు.