బిఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ప్రభుత్వ భూములు!

ముగ్గురు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం నుండి మూడు రోజుల పాటు జరిగిన సోదాలలోవిస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తున్నది. వీరు ప్రభుత్వం అండదండలతో హైదరాబాద్ శివారులో వేల ఎకరాల ప్రభుత్వ భూములతో  రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు వెల్లడైంది.
భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల నివాసాలు, కార్యాలయాలతో పాటు వారి సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి.  వీరు ముగ్గురూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే కావడం గమనార్హం. గత బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఐటి సోదాలు ప్రారంభంకాగా శనివారం అర్ధరాత్రి 2 గంటలకు ముగిశాయి. ఐటి అధికారులు మూడు రోజులపాటు సోదాలు చేపట్టారు. అర్ధరాత్రి రెండు గంటలకు ఎమ్మెల్యేల ఇంటి నుంచి ఐటి అధికారుల బృందం వెళ్లిపోయింది.
 
ఈ సందర్భంగా లైఫ్ స్టైల్ యజమాని గజ్జల మధుసూదన్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. ఆయన వివిధ వ్యక్తులకు అమ్మిన భూమి వ్యవహారమే సోదాలకు కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో వేల ఎకరాలను భూమిని మధుసూదన్ రెడ్డి అమ్మినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని తీసుకుని రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మాడు. ఈ భూమిలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులతో కలిసి మధుసూదన్ రెడ్డి వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

ఆయన కార్యాలయాలు, నివాసంలో కూడా ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. కంప్యూటర్‌, వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌, మొబైల్స్‌ స్వాధీనం చేసుకొని విచారించారు. మధుసూధన్‌ రెడ్డితో పాటు భార్య, కుమారుడిని అధికారులు ప్రశ్నించారు. నలుగురి మధ్య ఉన్న రియల్ ఎస్టేట్ భాగస్వామ్య వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మధుసూధన్ రెడ్డి జరిపిన లావాదేవీలపై విచారణ చేపడుతున్నారు.

బీఆర్‌ఎస్‌ నేఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిలు కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నారని ప్రచారం సాగుతుంది. మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీలో ఈ ముగ్గురు భాగస్వామ్యులుగా ఉన్నారనే ప్రచారంలో ఉంది. ఈ సంస్థకు చెందిన పన్ను చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్లను ఐటి అధికారులు పరిశీలించారని చెబుతున్నారు.
తల రియల్‌ ఎస్టేట్‌ సిండికేట్‌పై ఐటీ శాఖ అధికారుల బృందాలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 78 బృందాలు నిరంతరం విధుల్లో నిమగ్నమయ్యాయి. ఆరు రాష్ట్రాల నుంచి 440 మంది ఐటీ అధికారులను నియమించగా వారంతా హైదరాబాద్‌లోనే తిష్టవేశారు. ఇప్పటికే పలు కీలక పత్రాలతో పాటు కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, బ్యాంక్‌ లాకర్స్‌ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు- తెలుస్తోంది.
ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్‌, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.