ట్రంప్ ను వెంటాడుతున్న క్రిమినల్ కేసులు!

 
2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికెన్​ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా దూసుకెళుతున్న తరుణంలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను  క్రిమినల్​ కేసులువెంటాడుతుండటం అమెరికాలో కలకలం రేపుతోంది. `పోర్న్ స్టార్’ కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా రహస్య పత్రాల కేసులో తనపై అభియోగాలు మోపి నట్టు స్వయంగా ట్రంప్ ​ వెల్లడించారు.

2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైట్​ హౌజ్​ను ట్రంప్​ ఖాళీ చేశారు. అయినప్పటికీ ఆయన వద్ద ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది ఆగస్టులో ఫ్లోరిడాలోని ట్రంప్​  నివాసమైన మార్​- ఎ- లాగో ఎస్టేట్​లో ఎఫ్​బీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

దేశానికి చెందిన అత్యంత రహస్యమైన పత్రాలను ఇతర మ్యాగజైన్​లు, వార్తా పత్రికల మధ్య కలిపేశారని అధికారులు వెల్లడించారు. తాజా పరిణామాలపై తన సోషల్​ మీడియా ట్రూత్​ వేదికగా డొనాల్డ్​ ట్రంప్ స్పందించారు ​.

“ఈ అవినీతి బైడెన్​ ప్రభుత్వం.. నాపై మళ్లీ అభియోగాలు మోపింది. ఈ విషయం నా లాయర్లకు చెప్పింది,” అని డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు. ఇదే నిజమైతే ఫెడరల్​ ఛార్జీలు ఎదుర్కొనున్న తొలి సిట్టింగ్​/ మాజీ కమాండర్​ ఇన్​ చీఫ్​గా ట్రంప్​ అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఈ విషయంపై అమెరికా న్యాయశాఖ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లభించలేదు.sud