అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గువాహటి-న్యూ జల్‌పైగురి మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి సోమవారం ప్రారంభించారు. బొంగైగావ్-దుద్నోయి-మెండిపతేర్, గౌహతి-చాపర్ముఖ్ కొత్తగా విద్యుద్దీకరించిన రైలు మార్గాలను కూడా ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.

మొదటి ఈశాన్య వందే భారత్ రైలును ప్రారంభించడం వల్ల పర్యాటక రంగానికి ఊతమిస్తుందని, ఈశాన్య ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచుతుందని భావిస్తున్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 2016లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకముందు అభివృద్ధి శూన్యంగా ఉండేదని చెప్పారు. 

ఈ రైలు గౌహతి -న్యూ జల్పాయిగురి మధ్య 411 కి.మీ దూర రైలు ప్రయాణాన్ని 5 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఇది అత్యంత వేగవంతమైన రైలు. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ వారానికి ఆరు రోజులు నడుపుతామని రైల్వే అధికారులు చెప్పారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ఒక్కొక్కటి 52 సీటింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి.

ఈశాన్య ప్రాంత ప్రజలు రైల్వే ప్రయాణంలో ఆనందాన్ని పొందేందుకు తీసుకున్న చర్యలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అస్సాంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేశారని ప్రభుత్వ అధికారి తెలిపారు.