చైనాను వీడే కంపెనీలకు ఆకర్షణీయ గమ్యం భారత్

 
చైనా నుంచి బైటకు వచ్చి, కొత్త గమ్యాన్ని వెతుకుతున్న కంపెనీలకు భారత దేశం ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. బహుళ జాతీయ కంపెనీల (ఎంఎన్‌‌సీల) సీఈఓలు ఓ సర్వేలో ఇదే విషయాన్ని వెల్లడించారు. చైనాకు భూగోళిక, రాజకీయ సమస్యలు పెరగడంతో బిజినెస్‌‌, ట్రేడ్‌‌కు ఇబ్బంది కలుగుతుందని వారు తెలిపారు.
 
ఐఎంఏ ఇండియా  100 మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన సీఈఓలతో  చేసిన సర్వే ప్రకారం,   88 శాతం మంది సీఈఓలు భారత్ ను చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. గ్లోబల్ వర్క్‌‌ఫోర్స్‌‌లో భారత్ వాటా 24.9 శాతానికి పెరగడాన్ని కూడా వారు పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు థాయ్‌‌లాండ్‌‌, వియత్నాం, తమ సొంత ప్రాంతాలను కూడా ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

‘చాలా ఎంఎన్‌‌‌‌సీలు గత ఐదేళ్లలో భారత్ లో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడాన్ని చూడొచ్చు. కొంత చైనాకు ప్రత్యామ్నాయ గమ్యంగా  ఎన్నుకోవడంలో భాగంగా ఈ కంపెనీలు తమ బిజినెస్‌‌‌‌లను విస్తరించాయి. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్‌‌‌‌ కంపెనీలు భారత్ లోని తమ ఆఫీసుల్లో ఉద్యోగులను పెంచుకుంటున్నాయి’ అని ఐఎంఏ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ సూరజ్‌‌‌‌ సైగల్ తెలిపారు.

ఈ సర్వే ప్రకారం, 70 శాతం కంపెనీలు  చైనాలో గత మూడేళ్లలో తమ వ్యాపార విధానాలను భారీగా మార్చుకున్నాయి. ఇక్కడ   సర్వీస్ సెక్టార్ కంటే పారిశ్రామిక సెక్టార్ తమ బిజినెస్ విస్తరణను తగ్గించేసింది. మాన్యుఫాక్చరింగ్  సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని 56 శాతం కంపెనీలు  చైనా నుంచి సోర్సింగ్ తగ్గించామని, 41 శాతం కంపెనీలు ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ తగ్గించామని వెల్లడించాయి.

కొన్ని కంపెనీలు చైనా నుంచి ఇప్పటికే ఎగ్జిట్ అయిపోయాయి. 6 శాతం కంపెనీలు తమ బిజినెస్‌‌‌‌ను మళ్లీ పెంచామని వెల్లడించాయి. కాగా, భారత్ లో బిజినెస్‌‌‌‌లకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? కంపెనీలు వాటిని ఎలా అందిపుచ్చుకుంటున్నాయనే  విషయాన్ని కూడా ఐఎంఏ ఇండియా సర్వే చేసింది.

2017–18  తో పోలిస్తే 2022–23 నాటికి గ్లోబల్ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో  భారత్  వాటా  22.4 శాతం నుంచి 24.9 శాతానికి పెరిగింది. అదే రెవెన్యూ ప్రకారం చూస్తే, గ్లోబల్‌‌‌‌ షేర్‌‌‌‌‌‌‌‌లో భారత్ వాటా 14.8 శాతం నుంచి 15.8 శాతానికి ఎగిసింది.  గ్లోబల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో భారత్  వృద్ధి చెందుతుండడాన్ని ఇది చూపుతోంది.

ఐఎంఏ సర్వే ప్రకారం, సర్వీస్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని కంపెనీలతో పోలిస్తే ఎక్కువగా మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు భారత్, వియత్నాం లేదా థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ను చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. దీని బట్టి చాలా మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు తమ సప్లయ్‌‌‌‌ చెయిన్ రిస్క్‌‌‌‌లను తగ్గించుకోవడంపై ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది.

సర్వేలోని పాల్గొన్న సర్వీస్ కంపెనీల్లో 80 శాతం కంపెనీలు చైనా ఫ్లస్‌‌‌‌గా భారత్ లో తమ బిజినెస్‌‌‌‌లను విస్తరిస్తున్నామని వెల్లడించాయి. అదే పారిశ్రామిక  కంపెనీల్లో ఈ ఆలోచన విధానం తక్కువగా ఉంది. చాలా కంపెనీలు తమ సప్లయ్ చెయిన్‌‌‌‌ను మార్చుకోవడానికి భారత్ ను ఎంచుకున్నామని వెల్లడించాయి.

ఆఫ్‌‌‌‌ షోరింగ్‌‌‌‌ (విదేశాల్లో వ్యాపారం పెట్టడం), రీషోరింగ్ (సొంత దేశానికి వ్యాపారం షిఫ్ట్ చేయడం), ఫ్రెండ్‌‌‌‌షోరింగ్ (మిత్ర దేశాల నుంచి రామెటీరియల్స్ సేకరించడం) పై కంపెనీల సీఈఓలను ఐఏఎం అడిగింది. 45 శాతం మంది రెస్పాండెంట్లు ఆఫ్‌‌‌‌ షోరింగ్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వీరు ఇప్పటికే ఆఫ్ షోర్‌‌‌‌‌‌‌‌లో వ్యాపారం పెట్టడం లేదా  పెట్టే ప్లాన్‌‌‌‌లో ఉన్నారు.

అయితే తమ పెట్టుబడులకు భారత్ ను గమ్యంగా చూస్తున్న  కొన్ని అంశాల్లో ఇబ్బంది పడుతున్నాయి. ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌, రెగ్యులేషన్స్‌‌‌‌, స్కిల్ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం  పెరగడంతో ఫ్రెండ్ షోరింగ్‌‌ (మిత్ర దేశాల నుంచి మూడుపదార్థాలు  సేకరించడం)ఈ మధ్య పాపులరవుతోందని ఈ సర్వే వెల్లడించింది. డీగ్లోబలైజేషన్‌‌‌‌,  నేషనలిజం  పెరగడంతో దేశాలు స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న దేశాలతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.