కేసీఆర్ కు అధికారమిస్తే యువత సూసైడ్ నోట్ రాసుకున్నట్ట్లే

పొరపాటున కేసీఆర్ కు అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. వేలాది మందితో శనివారం ఖమ్మంలో బిజెపి ఆధ్వర్యంలో కదం తొక్కిన నిరుద్యోగ మార్చ్  ను ఉద్దేశించి మాట్లాడుతూ కొలువులు కావాలంటే కమలం రావాలని స్పష్టం చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జంబో డీఎస్పీని ప్రకటించి 25 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని సంజయ్రు. నిలువనీడలేని వాళ్లకు ఇండ్లు కట్టిస్తామని, రైతులకు ఫసల్ బీమా అమలు చేస్తామని  హామీ ఇచ్చారు. రాష్రంలోని యువత అంతా బీజేపీకి 5 నెలలు టైమివ్వాలని  ఈ సందర్భంగా కోరారు.

కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఎప్పుడో గల్లంతైందని చెప్పారు. 2018 నుండి ఇప్పటిదాకా జరిగిన అనేక ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లే రాలేదని తెలిపారు. గతంలో 29 శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్లు 19 శాతానికి దిగజారాయని పేర్కొన్నారు. 2018లో  40 శాతం ఓట్లున్న బీఆర్ఎస్ ఇప్పుడు 30 శాతానికి పడిపోయిందని చెప్పారు.

రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ‘‘నిరుద్యోగ మార్చ్’’ చేస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై ప్రజల ద్రుష్టిని మళ్లించే కుట్ర చేస్తున్నయని సంజయ్ ధ్వజమెత్తారు. “నిరుద్యోగులారా… మాకు 5 నెలలు టైమివ్వండి.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. పార్టీ అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం” అంటూ భరోసా ఇచ్చారు.

ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం వింతగా ఉందని ఎద్దేవా చేశారు.  ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టి హైదరాబాద్ కు ఆప్ నేతలు సిగ్గు చేటని విమర్శించారు. లిక్కర్ దందాలో వాటాల లెక్కలు మాట్లాడుకునేందుకే వారంతా సీఎం కేసీఆర్ ను కలిశారని ఆరోపించారు.

కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని, కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉన్నరని విమర్శించారు. రైతులు అల్లాడుతుంటే పంట నష్టపోయినా పైసా సాయం చేయలేదని చెప్పారు.  ఉద్యోగాల్లేక యువత అరిగోస పెడుతోందని, పరీక్షలు నిర్వహించడం చేతగాక పోవడంతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.