
వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ల స్థానంలో యూజర్‌నేమ్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికైనా మెసేజ్ చేస్తే అవతలివ్యక్తులకు మన ఫోన్ నెంబర్ కనిపించేది. దీనివల్ల ఒక్కోసారి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేది. అందుకే అవతలి వ్యక్తులకు ఇకపై మన ఫోన్ నెంబర్ తెలిసే వీలు లేకుండా వాట్సాప్ యూజర్‌నేమ్ అని పిలిచే సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ప్రకారం మనం ఎవరికైనా మెసేజ్ చేస్తే అవతలి వ్యక్తులకు మన ఫోన్ నెంబర్ బదులు యూజర్ నేమ్ కనిపిస్తుంది. దీనికోసం యూనిక్ యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా 2.23.11.15 వెర్షన్‌లో కనిపించిందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.
అంతేకాకుండా దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. దీని ప్రకారం వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యూనిక్ యూజర్‌నేమ్ సెట్ చేసుకోవడం ద్వారా దాంతోనే బంధుమిత్రులు, తెలిసిన వాళ్లతో కాంటాక్ట్ అవ్వొచ్చు. అలాగే ఏవైనా గ్రూపుల ద్వారా కాంటాక్ట్ అయ్యే వ్యక్తులకు కూడా మన ఫోన్ నెంబర్ కనిపించకుండా జాగ్రత్త పడొచ్చు.
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది కాబట్టి ఇందులో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ యాప్‌లో యూజర్‌నేమ్ సెర్చ్ చేయడం ద్వారా కూడా సంబంధిత వ్యక్తులను కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టెక్‌నిపుణులు భావిస్తున్నారు.
More Stories
కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మగాళ్లకే
ధనిక దేశాలు భారత్ కు భారీగా పరిహారం చెల్లించాలి
ఆవులు, ప్లకార్డులతో కర్ణాటక బీజేపీ నిరసనలు