వివిధ సందర్భాల్లో ప్రత్యేక రూపొందించిన నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అలాగే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెం విడుదల చేయనుంది. పార్లమెంటు భవనం గుర్తుగా దీనిని విడుదల చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
35 గ్రాముల బరువు, 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉన్న ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్ మిశ్రమాలతో తయారు చేశారు. ఈ నాణెం డిజైన్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.
ఆశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం ఇందులో ఉండనుంది. ఈ లయన్ క్యాపిటల్ కింద ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. ఎడమవైపు.. ‘భారత్’ అన్న పదం దేవనగరి లీపిలో రాసి ఉంటుందని తెలుస్తోంది. కుడివైపు ఆంగ్లంలో ‘ఇండియా’ అని రాసి ఉండనుంది
కాగా ఈ నాణెంపై రూపీ సింబల్‌తో పాటు డినామినేషన్ విలువగా 75 ఉండనుంది. లయన్ క్యాపిటల్ కింద ఇవి ఉండనున్నాయి. నాణెం ఎగువ అంచుపై ‘సంసద్ సంకుల్’ అని దేవనగరి స్క్రిప్ట్‌లో, దిగువ అంచున ‘పార్లమెంట్ కాంప్లెక్స్’ ఉండనున్నాయి.
ఈ రూ. 75 విలువ చేసే నాణేనికి సంబంధించి రానున్న రోజుల్లో మరింత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రూ. 1, రూ. 2, రూ. 5 విలువ చేసే నాణాలు ఎక్కువగా వాడకంలో ఉన్నాయి. గతంలో రూ. 10ని ఆర్బీఐ విడుదల చేసినప్పటికీ, వాటి వాడకం తగ్గిపోయింది!
More Stories
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు
రాంగోపాల్ వర్మకు చెక్‌బౌన్స్ కేసులో జైలు శిక్ష!
సైఫ్ అలీఖాన్ కుటుంభం రూ. 15,000 కోట్ల ఆస్తుల జప్తు!